కవలలమని తెలీక.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
ఇద్దరు కవలల పిల్లలు.. విధి చేసిన వింత నాటకంలో ఒకరికి మరొకరు దూరమయ్యారు. తర్వాత పెద్దయ్యాక ఒకరినొకరిని కలుసుకున్నారు. వారి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్లికి దారితీసింది
ఇద్దరు కవలల పిల్లలు.. విధి చేసిన వింత నాటకంలో ఒకరికి మరొకరు దూరమయ్యారు. తర్వాత పెద్దయ్యాక ఒకరినొకరిని కలుసుకున్నారు. వారి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్లికి దారితీసింది. ఏదో సినిమా కథ చదవినట్లుగా ఉంది కదూ. కానీ నిజజీవితంలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువతీ యువకులు.. కాలేజీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా.. పిల్లలు పుట్టకపోవడంతో.. వారు డాక్టర్ ని సంప్రదించారు. వారికి ఐవీఎఫ్ పద్ధతిలో సంతానభాగ్యాన్ని కల్పించడానికి డాక్టర్ వారిద్దరి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించింది.
సాధారణంగా తన వద్దకు వచ్చే దంపతుల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించడం ఆమెకు అలవాటే. అదో రొటీన్ చెకప్. అయితే అక్కడే ఈ కథలో ట్విస్టు. వారి డీఎన్ఏల్లో చాలా పోలికలు కనిపించాయి వైద్యురాలికి. వాళ్లిద్దరూ ఒకే వయసు వారు కావడంతో మొదలుపెడితే.. జన్యు పరంగా చాలా పోలికలు ఉండటాన్ని వైద్యురాలు గమనించింది.
చివరకు వారిద్దరూ ఒకే తల్లికడుపులో పుట్టారని.. అంతేకాదు వారు కవల పిల్లలు అని తేలింది. వారిద్దరి నేపథ్యాల గురించి ఆరా తీసింది. వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు.. అనే అంశం గురించి పరిశోధించింది.. అంతిమంగా వాళ్లిద్దరూ కవల పిల్లలు అనే అంచనాకు వచ్చింది.
వారి నేఫథ్యాలను చూస్తే... వారిద్దరూ కవల పిల్లలు. 1984లో పుట్టారు. వీరు పుట్టాకా ఒక రోడ్ యాక్సిడెంట్ లో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అనాథలైన వీరిని వేర్వేరు కుటుంబాలు చేరదీసి పెంచాయి. అలా పెరిగిన వాళ్లు దశాబ్దాల తర్వాత కాలేజీలో కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కథ నెట్టింట ఓ సంచలనం సృష్టించింది.