కరివేపాకు పెంచడానికి మీడియం నుంచి పెద్ద సైజు కుండీ ఎంచుకోవాలి. అంతేకాకుండా కుండీ అడుగున రంథ్రాలు ఉండేలా చూసుకోవాలి.
మంచి నాణ్యమైన మట్టితో కండీని నింపాలి. మితమైన మోతాదులో సేంద్రియ ఎరువు లేదా కంపోస్ట్ కలపవచ్చు.
మొక్కలను కుండీలో నాటిన తర్వాత రోజూ నీళ్లు పోయాలి. తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
మొక్క పెరుగుతున్నప్పుడే కరివేపాకు కోయడం మొదలుపెట్టొద్దు. మొదటి పది నెలల వరకు ఆకులను తుంచకుండా జాగ్రత్తపడాలి.
మంచి సూర్యరశ్మిలో కరివేపాకు బాగా పెరుగుతుంది. రోజంతా ఎండ తగిలే ప్రదేశంలో మొక్క ఉండేలా చూసుకోవాలి.
పెరుగుతున్న దశలో, రెండు లేదా నాలుగు రోజులకు ఒకసారైనా మొక్కకు నీళ్లు పోయాలి. భారీ వర్షాల తర్వాత, వర్షాకాలంలో మట్టి ఆరిన తర్వాతే నీళ్లు పోయాలి.
మొక్కలకు సుమారు రెండు నెలల వయస్సు వచ్చాక, మితంగా నీళ్లు పోస్తే సరిపోతుంది. చలికాలంలో మొక్కకు ఎక్కువగా నీళ్లు పోయొద్దు. మట్టి ఆరనివ్వాలి.
Indoor Plants: ఈ మొక్కలు నీటిలో కూడా ఈజీగా పెరుగుతాయి!
ఈ మొక్కలు ఉంటే ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు
ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలామంచిది.. ఎందుకో తెలుసా?
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎందుకు పెంచాలి?