ప్రస్తుత కాలంలో పింపుల్స్  సమస్యతో బాధపడే యువతీయువకుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఒక్కసారి పింపుల్స్ వచ్చాయంటేచాలు.. అవి తగ్గిపోయినా.. వాటి తాలుకు మచ్చలు మాత్రం వదలవు. దీంతో.. ముఖం అందాన్ని కోల్పోతుంది. కేవలం యువతులే కాదు..యువకులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో లభించే క్రిములకన్నా.. వంటింట్లో లభించే పదార్థాలు  వాడి చూడమంటున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూసేద్దామా...

పూర్వకాలంలో శెనగపిండిని సౌందర్య సాధనంలా వినియోగించేవారు. ఈ శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి.. ముఖానికి పట్టించి.. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం తో పింపుల్స్, వాటి తాలుకా మచ్చలు పోతాయని చెబుతున్నారు.

కొద్దిగా ఉల్లిపాయ రసంలో కొంచెం తేనె కలిసి.. పింపుల్స్ ఉన్న చోట రాసి.. మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ముఖంపై పడిన నల్లమచ్చలు తగ్గిపోతాయట.

గులాబీ పువ్వు రేకులు, బచ్చలి కూర ఆకులు నూరి.. వాటి రసాన్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి మూసార్లు చేస్తే.. నల్ల మచ్చల సమస్య తీరుతుంది.

టమాట రసం, కీరదోస గుజ్జులు కూడా పింపుల్స్ నివారణకు చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.