Asianet News TeluguAsianet News Telugu

తలనొప్పి తగ్గించే.. ఇంటి చిట్కాలు

కేవలం మన వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతో తలనొప్పిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఒకసారి చూసేద్దామా...

home remedies for headache is here
Author
Hyderabad, First Published Oct 5, 2018, 3:37 PM IST

ఒక్క రోజు సరిగా నిద్రలేకపోయినా, పని ఒత్తిడి పెరిగినా.. ఇలా కారణం ఏదైనా ముందు వచ్చేది తలనొప్పే. కొందరికైతే.. వారు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా రెగ్యులర్ గా ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి తగ్గించేందుకు పెయిన్ కిల్లర్ వేసుకోక తప్పదు. కానీ ఈ పెయిన్ కిల్లర్స్ ఎంత వరకు సురక్షితం..? అందుకే కేవలం మన వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతో తలనొప్పిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఒకసారి చూసేద్దామా...

1. వెన్న, మటన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల తలపోటు పెరుగుతుంది. విటమిన్‌-సి, డి, కాల్షియం, బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలా ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్‌. పోషకాలున్న ఆహారాలతో పాటు, మంచి నిద్ర, కొద్దిపాటి వ్యాయామం వంటివి తలనొప్పిని దూరం చేస్తాయి.

2. కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి మాయం అవుతుంది.

3. ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రభావం తొందరగా ఉంటుంది.

4. యూకలిప్టస్‌ తైలం తలనొప్పి నివారిణిగా బాగా పని చేస్తుంది.

5. గోరువెచ్చని ఆవుపాలు తాగినా త‌ల‌నొప్పి నుంచి రిలాక్స్‌ అవ్వొచ్చు.

6. చందనాన్ని పేస్ట్‌లా చేసుకుని నుదుటికి అప్లయ్‌ చేసినా మంచి గుణం కనిపిస్తుంది.

7. కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను నుదుటిపై 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్‌ చేసి చూడండి.. తలనొప్పి త‌గ్గుతుంది.

8. నీరు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.

9. యాపిల్‌ పండుతో పాటు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకున్నా తలనొప్పి మటుమాయం అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios