Holi 2023: రకరకాల రంగులు లేని రంగుల పండుగ అస్సలు బాగోదు. హోలీకి రంగులే స్పెషల్ . వీటిని నీటిలో కలిపి ఒకరిపై ఒకరు జల్లుకుంటుంటే బలే ఉంటుంది. ఇదంతా బానే ఉంది కానీ అసలు హోలీకి రంగులను జల్లుకునే సాంప్రదాయం ఎలా వచ్చిందో మీకు తెలుసా?
Holi 2023: హోలీ పండుగ ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఎలాంటి భేద భావాలు లేకుండా ఈ పండులను జరుపుకుంటారు. ముఖ్యంగా తీరొక్క రంగులు, రంగు రంగుల నీళ్లు ఈ పండుగ ప్రత్యేకతలు. ఈ పండును వసంత రుతువు ప్రారంభానికి గుర్తుగా దేశంలోని ప్రతి ఒక్క చోటా సెలబ్రేట్ చేసుకుంటారు.
హోలీని ఎందుకు జరుపుకుంటారు?
హోలీని సెలబ్రేట్ చేసుకోవడం వెనకు రెండు కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. పురాణాల ప్రకారం.. రాక్షస రాజు హిరణ్యకశ్యపుని సోదరి హోలికా పేరు మీద ఈ పండుగకు హోలీ అనే పేరు వచ్చింది. అయితే హిరణ్యాకశ్యపుడు తన తప్పస్సుతో ఒక వరం పొందుతారు. ఈ వరం వల్ల అతన్ని ఈ ప్రపంచలోని ఏ శక్తి ఏ విధంగానూ చంపలేదు. దీనినే అవకాశంగా తీసుకుని హిరణ్యాకష్యపుడు ప్రతిఒక్కరినీ వేధించడం మొదలుపెడుతుంటాడు. తనకు తాను దేవుడిగా భావించి ప్రతి ఒక్కరూ తనను ఆరాధించాలని ఆదేశించాడు. అయితే ఈ రాక్షస రాజు చిన్న కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువును ఆరాధించేవాడు. రాక్షస రాజుకు విష్ణువు అంటే అస్సలు ఇష్టం లేదు. కారణం అతని సోదరుడిని అంతం చేశాడని. కొడుకును విష్ణువును ఆరాధించడం మానేయమని ఎన్నో సార్లు చెప్పి చూస్తాడు. కానీ ప్రహ్లాదుడు అస్సలు వినడు. దీంతో కొడుకును చంపాలనుకుంటాడు హిరణ్యకశ్యపుడు. ఇందుకోసం తన సోదరి హోలికను పిలిపించి ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చితి మంటలపై కూర్చోమంటాడు. అయితే అందులో హోలిక కాలిపోకుండా ఆమెకు ఒక కండువా ఉంటుంది. మంటల్లోకి వెళ్లిన తర్వాత ఆ కండువా హోలిక మీది నుంచి ప్రహ్లాదుడి మీదికి ఎగురుతుంది. దీంతో హోలికా అందులోనే బూడిద అవుతుంది. విష్ణుమూర్తి వల్ల ప్రహ్లాదుడు క్షేమంగా ఉంటాడు. అందుకే చెడుపై మంచి విజయం సాధించిన విజయంగా ఈ పండుగను జరుపుకుంటారు.
రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుని సంహరించడంతో విష్ణుమూర్తి నరసింహుడిగా అవతరిస్తాడు. అందుకే ప్రహ్లాదుడు, శ్రీమహావిష్ణువు రాక్షస రాజును, హోళికుడిని జయించిన మంచివారు అంటారు. అందుకే హోలీకి ఒక రోజు ముందు వెలిగించే భోగి మంటలను హోలికా దహన్ అని పిలుస్తారు.
రంగులతో హోలీని ఎందుకు ఆడతాం?
హోలీ జరుపుకోవడానికి రెండో అత్యంత ప్రాచుర్యం పొందిన కథ.. కృష్ణ రాధల ప్రేమ కథ. నిజానికి కృష్ణుడు నీలం రంగులో పుడతాదు. రాధ మాత్రం తెల్లగా ఉంటుంది. ఇద్దరి మధ్య వర్ణ భేదం కారణంగా రాధ తనతో మాట్లాడదని కృష్ణుడు భావిస్తాడు. అప్పుడు కృష్ణుని తల్లి రాధకు రంగులు జల్లమని సలహానిస్తుంది. రంగులను జల్లడం వల్ల వర్ణ భేదం కనిపించదు. అందరూ ఒకేలాగ కనిపిస్తారు.
ఇకపోతే హోళీ సందర్భంగా నీళ్లలోల రంగులను కలిపిచల్లే ఆచారం వచ్చింది. భారతదేశంలో లాత్మార్ హోలీ, హోలా మొహల్లా, కృష్ణ హోలీ, ఖాదీ హోలీ వంటి వివిధ రకాల హోలీలు జరుపుకుంటారు. వీటన్నింటినీ రంగులు, నీళ్లు, గుడ్లతో జరుపుకుంటారు.
హోలీ మన దేశంలో ఒక గొప్ప పండుగ. కాశ్మీర్ నుంచి కేరళ వరకు.. గుజరాత్ నుంచి అస్సాం వరకు హోలీని దేశవ్యాప్తంగా ఎన్నో రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎరుపు రంగు సంతానోత్పత్తిని, నీలం కృష్ణుని రంగును, పసుపు పసుపు రంగును, ఆకుపచ్చ రంగు వసంత ఋతువును ప్రారంభాన్ని, కొత్తదనాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే గులాబీలు, డైసీలు, పొద్దుతిరుగుడు పువ్వులు, బంతిపూలు వంటి పూల రేకులతో కూడా హోలీ ఆడతారు.
