Holi 2023: రంగుల పండుగను చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ ఏడాది ఈ పండుగను ఏ తేదీన జరుపుకోబోతున్నామో తెలుసా?
Holi 2023: చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ హోలీ పండుగ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. హోలీని వసంత రుతువులో జరుపుకుంటారు.హోలీ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ భారతదేశంలో జరుపుకునే పురాతన, అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగల్లో ఒకటి. ఈ పండుగ రాధాకృష్ణుల అమర ప్రేమను కూడా సూచిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఫాల్గుణ మాసం పౌర్ణనమి రోజున దేశవ్యాప్తంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు.
హోలీ 2023: తేదీ, సమయం
హోలీని చాలా ప్రదేశాల్లో రెండు రోజుల పాటు జరుపుకుంటారు. ఏ ఏడాది మార్చి 8 న రంగుల పండుగను జరుపుకోబోతున్నాం. దీపావళి తర్వాత వచ్చే అతి రెండో అతిపెద్ద పండుగ హోలీనే. ద్రిక్ పంచాంగం ప్రకారం.. పూర్ణిమ తిథి మార్చి 4 సాయంత్రం 17:06 గంటలకు ప్రారంభమై మార్చి 07 న సాయంత్రం 6:09 గంటలకు ముగుస్తుంది.
హోలీ 2023: చరిత్ర
హోలీ పండుగ చలికాలం ముగింపును.. వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ హోలీ పండుగ వసంత పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. హోలీని రెండు రోజుల పండుగగా జరుపుకుంటారు. మొదటి రోజు హోలికా దహన్ లేదా చోటీ హోలీగా జరుపుకుంటారు. రెండో రోజు హోలీని జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం.. హోలీ పండుగా హిరణ్యకశ్యపుడు, భక్తప్రహ్లదుడి పురాణంతో ముడిపడి ఉంది.
హోలీ పండుగ ప్రాముఖ్యత
ప్రేమ, వసంతకాలం, చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే ప్రసిద్ధ పండుగ హోలీ. ఇది రంగురంగుల పండుగ. ఇది ఆనందమైన జీవితానికి ప్రతీక, రంగులతో ఆడుకోవడం, కమ్మని వంటలను ఇచ్చిపుచ్చుకోవడం ఈ పండుగకున్న ప్రత్యేకత. ప్రేమ, స్నేహానికి చిహ్నంగా ఒకరికొకరు రంగులను పూసుకుంటూ హోలీని జరుపుకుంటారు.
హోలీకి ఉన్న వివిధ పేర్లు
హోలీ రెండో రోజును రంగ్వాలి హోలీ, ధులాండి లేదా ఫగ్వా అని కూడా పిలుస్తతారు. రంగులు, నీల్లు, పువ్వులతో ఈ హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగను ‘ప్రేమ పండుగ’, ‘రంగుల పండుగ’అని కూకడా అంటారు.