Asianet News TeluguAsianet News Telugu

కండోమ్ ఎక్కడ దాస్తున్నారు..? పాకెట్ లో కాదు కదా..

చాలా మందికి కండోమ్‌లను పర్సుల్లో లేదా ప్యాంట్ జేబుల్లో దాచుకోవడం అలవాటు. కానీ ఇలా చేయడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు.

Here's why you should never store condom in your wallet, or pocket
Author
Hyderabad, First Published Aug 25, 2018, 3:54 PM IST

సురక్షిత శృంగారానికి కండోమ్స్ వాడండి అని ప్రభుత్వాలే ప్రచారం చేస్తూ ఉంటాయి. సుఖ వ్యాధులు ముఖ్యంగా హెచ్ఐవీ, ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు చాలామంది ఈ కండోమ్స్ నివాడుతుంటారు. అంతేకాదు.. అవాంచిత గర్భానికి చోటుఇవ్వకుండా కూడా ఇవి సహాయపడతాయి. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. షాప్ లో కొన్న కండోమ్ ప్యాకెట్లను మీరు ఎక్కడ దాచిపెడుతున్నారు..?

చాలా మందికి కండోమ్‌లను పర్సుల్లో లేదా ప్యాంట్ జేబుల్లో దాచుకోవడం అలవాటు. కానీ ఇలా చేయడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. వేడి, తేమ, రాపిడి, వెలుతురు లాంటి పరిస్థితులు కండోమ్ నాణ్యతను దెబ్బతీస్తాయట. ఇలాంటి పరిస్థితుల వల్ల అవి ఎఫెక్టివ్‌గా పని చేయకుండా పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. 

వాలెట్లు, పాకెట్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. వేడి పెరిగే కొద్దీ కండోమ్‌లలోని లాటెక్స్ వీక్ అవుతుంది. దీంతో అవి పాడయ్యే అవకాశం ఉంది. అంతే కాదు ప్యాకెట్లలో బైక్ కీస్ లాంటి పదునైన వస్తువులు ఏవైనా ఉంటే.. కండోమ్‌లు చిరిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వాటిని వాడటం వల్ల సుఖ వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోలేం. 

బాత్రూంలో, కిటికీల్లోనూ ఉంచే విషయంలోనూ మరోసారి ఆలోచించుకోండి. తేమ, వేడి, సూర్యరశ్మి కారణంగా అవి పాడయ్యే ప్రమాదం ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios