Asianet News TeluguAsianet News Telugu

పెయిన్ కిల్లర్స్ తో గుండె నొప్పి, పక్షవాతం..?

ఈ పెయిన్ కిల్లర్స్ రక్తంలోని ప్లేట్ లేట్లపై భిన్నంగా పనిచేయడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. 

Heightened risk of heart attacks found with common painkillers in routine
Author
Hyderabad, First Published Sep 6, 2018, 3:31 PM IST

తలనొప్పికి, నడుము నొప్పికి.. ఇలా చీటికీ మాటికీ.. పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారా..? ఆ పెయిన్ కిల్లర్స్  వేసుకున్నప్పుడు ఆ సమయంలో నొప్పి తగ్గి వెంటనే ఉపశమనం కలుగుతూ ఉండొచ్చు. కానీ వాటివల్ల మీ గుండెకు ముప్పు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పెయిన్‌కిల్లర్‌ మాత్రలను వాడిన 63లక్షల మంది డేటాను విశ్లేషించి.. డెన్మార్క్‌లోని పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధరించారు.

ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం మొదలుపెట్టిన కొన్ని వారాల్లోనే గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే వీటి మోతాదు పెరిగే కొద్ది ముప్పు కూడా అదే క్రమంలో పెరుగుతుంది. ఈ ముప్పు గుండె జబ్బులు ఉన్నవారికే కాకుండా లేని వారికి కూడా  వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ పెయిన్ కిల్లర్స్ రక్తంలోని ప్లేట్ లేట్లపై భిన్నంగా పనిచేయడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎంత వరకు వీలైతే అంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచింది. తప్పక వేసుకోవాల్సి వస్తే.. వైద్యుల సలహాతో వేసుకోవాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios