Asianet News TeluguAsianet News Telugu

గుండెపోటు ఎలా ఉంటుంది? ప్రాణాలతో బయటపడ్డవారు దీని గురించి ఏమంటున్నారంటే?

సాధారణంగా చాలా మంది గుండెపోటు లక్షణాలను గమనించరు. దీనివల్లే ఎంతోమంది హార్ట్ ఎటాక్  తో చనిపోతున్నారు. అయితే గుండెపోటు వచ్చినా.. ప్రాణాలతో బయటపడ్డవారు దీనిగురించి, లక్షణాల గురించి కొన్ని విషయాలను తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Heart attack: What does a heart attack feel like? Survivors share symptoms
Author
First Published Nov 25, 2022, 10:02 AM IST

ప్రస్తుత కాలంలో గుండెపోటుతో చనిపోతున్నవాళ్లే ఎక్కువున్నారు. ఈ గుండెపోటు వస్తే ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. ఇది ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. ఇది అటాక్ చేసినప్పుడు ఏ మాత్రం లేట్ చేసినా.. ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవచ్చు. నిజానికి గుండెపోటు రావడానికి నెల ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ చాలా మంది గెండెపోటు బాధితులకు తమకు హార్ట్ ఎటాక్ ఉందో? లేదో? గుర్తించలేకపోతున్నారు. కారణం దాని లక్షణాలను గమనించలేక. దీనివల్లే చాలా మంది చనిపోతున్నారు. అయితే గుండెపోటు నుంచి ప్రాణాలతో బయటపడిన కొంతమంది ఆ సమయంలో ఎలాంటి లక్షణాలు కనిపించాయో తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నేను చాలా అలసిపోయాను. ఊపిరి ఆడలేదు- డేవ్ పార్క్

డేవ్ పార్క్ అనే వ్యక్తి క్వోరా వినియోగదారుడు. ఇతనికి 5 ఏండ్ల కిందట గుండెపోటు వచ్చింది. అప్పుడే ఇతను అనుభవించిన విషయాలను ఇలా పంచుకున్నారు. 

2017 లో నేను పెరట్లో కోత కోస్తున్నాను. పనిప్రారంభించిన కేవలం ఐదు నిమిషాల్లోనే నేను విపరీతంగా అలసిపోయాను. ఊపిరిపీల్చుకోవడం కష్టంగా మారింది. చెమటలు ఎక్కువగా పడుతున్నారు. దాంతో నేను వెంటనే కోయడం మానేశాను. నేను ఇలా అయిపోతున్నానేంటి అని ఆలోచిస్తున్నారు. కొద్ది సేపటికి మళ్లీ నేను కోతను ప్రారంభించాను. మరు నిమిషంలోనే నా పరిస్థితి దారుణంగా మారింది. నాకు చెమట పట్టడం ఎక్కువైంది. శ్వాస ఆడటం లేదు. నా ఛాతిపై పెద్ద బండరాయి పడ్డట్టు అనిపించింది. ఛాతిలో ఏదో పడ్డ నొప్పి. ఇది ఏమాత్రం తగ్గడం లేదు. ఎంతసేపైనా అలాగే ఉంది. నా వీపు మధ్యలో భయంకరమైన నొప్పి వచ్చింది. ఆ నొప్పి నా చేతుల వెనుక భాగాలకు పాకింది. ఈ నొప్పి కుడి చేయి కంటే ఎడమ చేతికే ఎక్కువ వచ్చిందని పార్క్ చెప్పారు. ఆ తర్వాత అతను కుప్పకూలాడు. ఆ తర్వాత అతను తనను ఎమర్జెన్సీ కు తీసుకెళ్లమని తన భార్యను కోరాడు. 

అయితే ఇతను 45 నిమిషాల తర్వాత ఈ నొప్పి నుంచి బయటపడ్డాడు. అలాగే అతను హాస్పటల్ లో చేరాడు. ‘ఈ సమయంలో నా రక్తపోటు 185/125, HR 160+ నుంచి నా బీపీ 150/110, HR 120+కి పడిపోయింది. వారు కార్డియాక్ ట్రోపోనిన్ స్థాయిలు పెరుగున్నాయని వెల్లడించారు. అంటే ఇది గుండెపోటును సూచిస్తుంది. అందుకే నా  నా హృదయ స్పందన రేటును, రక్త పోటును తగ్గించాలనుకున్నారు. ఇందుకోసం మందులను, నైట్రోగ్లిజరిన్  IV ని ప్రారంభించారని ఆయన చెప్పారు. 

వాసోడైలేటర్ కారణంగా అతనికి రెండున్నర రోజులు తలనొప్పి వచ్చిందని పార్క్ చెప్పారు. అప్పుడు సెలవు దినం కావడంతో తనను ఐసియుకు తరలించారు. తన రక్తపోటును తక్కువగా ఉంచే మందులను వారు కనుగొన్నారు. కానీ చాలా తక్కువగా కాదు. బీపీని మరీ తక్కువగా చేస్తే అవయవ నష్టం జరుగుతుందని అతను చెప్పాడు. నైట్రోగ్లిజరిన్ ఒక వాసోడైలేటర్. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. అలాగే బీపీని తగ్గిస్తుందని పార్క్ చెప్పాడు.  నాకు టీ తాగే అలవాటు లేదు కాబట్టి రెండు రోజులు వచ్చింది. అయితే క్రమం తప్పకుండా కాఫీ తాగే అలవాటున్న వాళ్లకి పరిస్థితి దారునంగా ఉంటుందని పార్క్ అన్నారు. 

నా అనుభవం పూర్తిగా భిన్నమైంది- సుసాన్ లాంగ్

మరో కోరా వినియోగదారులు సుసాన్ లాంగ్.. ఆమె గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. 

రాత్రిపూట 11 గంటల సమయంలో ఇంట్లోనే నేను ఒంటరిగా ఉన్నాను. అప్పుడు నా ఎడమ రొమ్ముకు కొంచెం పైన ఒక అజీర్థి బుడగ ఉంది. అది పోవాలని నేను బయట నడవడానికి ప్రయత్నించాను. త్రేన్పు తీయడానికి కూడా ప్రయత్నించాను. కానీ అది పనిచేయలేదు. ఆ తర్వాత నేను పడుకోవాలనుకున్నారు. అప్పుడు ఆ బుడగ నా గొంతు వరకు వచ్చినట్టు అనిపించింది. కానీ నేనే దాన్ని బయటకు తీయలేకపోయాను అని రాసింది. 

‘అప్పుడు నాకు విపరీతమైననన చెమట పట్టడం మొదలైంది. పేపర్ టవల్ తో తుడుచుకుంది. ఈ చెమట మరింత ఎక్కువైంది. అప్పుడు నాకు ఏదో జరుగుతుంది అన్న అనుమానం పట్టింది. గుండెపోటు వచ్చిందని అనుమానించాను. అందుకే నేను వెంటనే 911 కు కాల్ చేశాను. అంబులెన్స్ వచ్చి నన్ను అందులో తీసుకెళ్లారు. నాకు నైట్రో ఇచ్చారు. దాంతో చెమటలు పట్టడం తగ్గింది. నా లక్షణాలను చూసి గుండెపోటుగా గుర్తించారు. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి.. నాకు నొప్పి లేదా ఒత్తిడి ఉందని నేను ఎప్పుడూ చెప్పలేదు. చెమటలు ఎక్కువగా పట్టకపోయి ఉంటే నేను 911 కు కాల్ చేసే దాన్ని కాదని ఆమె చెప్పింది. 

ఆమె ఎడమ ప్రైమరీ ఆర్టరీ ఫీడర్ లో అడ్డంకి ఉంది. అలాగే ఆమె కార్డియాక్ కాథెటరైజేషన్ చేయించుకుంది. దీనిలో ఆమెకు రెండు స్టెంట్ లు పెట్టారు. 

గుండెపోటు లక్షణాలు పురుషులు, మహిళల్లో మారుతూ ఉంటాయి

గుండెపోటుతో సంబంధం ఉన్న లక్షణాలు పురుషులు, మహిళలకు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో ఛాతీ నొప్పి వంటి క్లాసిక్ లక్షణాలు కనిపిస్తాయి. మహిళలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వెన్నునొప్పి, అజీర్ణం వంటి అసాధారణ లక్షణాలను అనుభవిస్తారు. కొన్నిసార్లు మహిళలలకు ఛాతీ నొప్పి కలగకపోవచ్చు. దీంతో వారికి గుండెపోటు వచ్చినా పట్టించుకోరు. అసలు గుండెపోటే నని వారికి తెలియదు. 

పురుషులు, మహిళల్లో కనిపించే గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు

ఛాతీ నొప్పి, ఛాతీలో అసౌకర్యం, వికారం, దవడలో బిగుతు, ఛాతీలో మండుతున్న భావన, మైకము, వాంతులు, అలసట, చెమట. 

Follow Us:
Download App:
  • android
  • ios