సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. శరీరంలో అన్ని అవయవాలలో కెల్లా కంటి ఉన్న ప్రాధాన్యం అలాంటిది. కంటి చూపు లేకపోతే.. మనం లోకాన్ని చూడలేంద. అందుకే.. ఆ కంటి చూపుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మన చేతుల్లో నే ఉంది. ప్రస్తుత కాలంలో ఎవరి ఉద్యోగాలు అయినా.. కంప్యూటర్ లతోనే ముడిపడి ఉంటున్నాయి. రోజుకి 8గంటలకు పైగా ఆఫీసుల్లో కంప్యూటర్లు చూస్తూ కూర్చుంటారు. అంతేనా.. టీవీ, ఫోన్లు అంటూ వాటితోనూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. వీటి కారణంగా కళ్లు అలసిపోతుంటాయి.  చూపు సన్నగిల్లే అవకాశం కూడా లేకపోలేదు.

అలా జరగకుండా ఉండాలంటే.. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఓసారి తెలుసుకుందామా..

పేపర్ లో కానీ, కంప్యూటర్ లో కానీ.. ఏదైనా చదువుతున్నప్పుడు.. కచ్చితంగా తగిన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. నిత్యం కంప్యూటర్ల ముందు పనిచేసే వారు ప్రతి రెండు గంటలకు ఒకసారైనా కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.

కంటికి సంబంధించిన వ్యాయామాలను తరచూ చేస్తుండాలి. అంటే దగ్గర, దూరం వస్తువులను మార్చి మార్చి చూస్తుండాలి. కళ్లు అలసిపోయినట్లు అనిపించినా.. మంటలు పుట్టినా.. ఎర్రగా మారినా.. కీరదోస ముక్కలుగా కట్ చేసి కళ్లపై పెట్టుకోవాలి. లేదా కాటన్ బాల్స్ ని చల్లటి నీటిలో ఉంచి పెట్టుకున్నా ప్రతిఫలం దక్కుతుంది. 

రోజుకి కనీసం 8గంటల నిద్ర చాలా అవసరం.  ఎండలో వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ వాడుతూ ఉండాలి.