ప్రస్తుత కాలంలో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. ఒక్కసారి థైరాయిడ్ వచ్చిందంటే.. ఇక రోజూ ట్యాబ్లెట్స్ మింగాల్సిందే. మరి దీనికి పరిష్కారం లేదా అటూ.. రోజూ పరగడపున కొబ్బరి నీరు తాగితే.. థైరాయిడ్ కంట్రోల్ లో ఉంటుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. పరగడపున కొబ్బరి నీరు తాగడం వల్ల ఈ వేసవిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

రోజూ ప‌ర‌గ‌డుపున కొబ్బ‌రి నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. శ‌రీరంలో ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. 

మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు క‌రిగిపోతాయి. శ‌రీరానికి కొత్త శ‌క్తి వ‌స్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు పోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

 జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే క్రిములు చ‌నిపోతాయి. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌లబ‌ద్ద‌కం ఉండదు. విరేచ‌నం సాఫీగా అవుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డే వారు ఉద‌యాన్నే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే మంచిది. 

 కొబ్బరినీళ్లు కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి. నేత్ర స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి.