దీపావళి ఆనందంగా సాగాలంటే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పిల్లలతోపాటు పెద్దలూ కాటన్‌ దుస్తులనే ధరించడం మంచిది. ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదంటే రగ్గులను కప్పి మంటలను నిరోధించాలి. దుప్పట్లు కప్పడం వల్ల మంటకు ఆక్సిజన్‌ అందక పైకి వ్యాపించదు. 

Happy Diwali 2019: 5 Ways to Celebrate Safe  Deepavali

ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు... అందరికీ నచ్చే పండగ ఏది అంటే ముందుగా వినిపించేది దీపావళి. కొందరు ఇంటి చుట్టూ దీపాలు వెలిగించుకొని ఆనందపడితే... మరికొందరు టాపాసులు కాల్చి ఆనందంపడతారు. చీకటిని పారద్రోలి... వెలులుగు చిమ్మే ఈ దీపావళి అందరికీ నచ్చుతుంది. ఈ పండగ మరింత ఆనందంగా జరుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అనుకోకుండా.. పొరపాటున జరిగే కొన్ని తప్పిదాలు.. తీవ్ర సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి... ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

ముందుగా.. ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్లు పక్కన పెట్టుకోండి. వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేయాలి.

చల్లదనం కోసం ఇంటి ముందు లేదంటే మేడపైన తాటాకులు, గడ్డితో వేసుకున్న రిసార్ట్‌ల వంటి వాటిపై నీళ్లు చల్లి ఉంచుకోవాలి. మీ వాహనాలపై కవర్లు వేసి ఉంచాలి. పండుగ సమయంలో వాహనాలను వీలైనంత వరకూ ఇంటిలోపలే ఉంచేలా చర్యలు తీసుకోవాలి.

Happy Diwali 2019: 5 Ways to Celebrate Safe  Deepavali

పిల్లలతోపాటు పెద్దలూ కాటన్‌ దుస్తులనే ధరించడం మంచిది. ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదంటే రగ్గులను కప్పి మంటలను నిరోధించాలి. దుప్పట్లు కప్పడం వల్ల మంటకు ఆక్సిజన్‌ అందక పైకి వ్యాపించదు. పిల్లలకు పొడవైనవి, బాగా లూజుగా వుండే దుస్తులు వేయవద్దు. టపాసులు కాల్చటం కష్టమవుతుంది. బిగువుగా వుండే ప్యాంటు, షర్టు వంటివి వేయండి. వీటితో పిల్లలు టపాసులు కాల్చటం తేలికవుతుంది.

నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడితే సెప్టిక్‌ కాకుండా నిరోధించేందుకు బర్నాల్‌, దూది, అయోడిన్‌, టించర్‌, డెటాల్‌ కూడిన ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రాధమిక వైద్యం చేసిన ఉపశమనం లభించకపోతే వైద్యుని వద్దకు వెళ్లి పూర్తి చికిత్స చేయించుకోవాలి.

పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు వెంట ఉండాలి. దగ్గరుండి వారితో కాల్పించడం అత్యంత శ్రేయస్కరం. పిల్లలు టపాకాయలు చూస్తే ఎంతో ఉత్సాహం. ఆ ఉత్సాహంలో జాగ్రత్తలు మరిచిపోతారు. కనుక ప్రతి టపాకాయను ఎలా పేల్చాలో వారికి తెలియజేయాలి. టపాసులు కాల్చే ప్రదేశం సరైనదై ఉండాలి. రోడ్డు మధ్యలో లేదంటే ఇంటిలోపల, గుంపులుగా ఉన్న చోట కాల్చవద్దని పిల్లలకు తెలియజెప్పాలి.

Happy Diwali 2019: 5 Ways to Celebrate Safe  Deepavali

బాంబులను ఎవరు కాల్చినా పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూదిపెట్టండి. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్ధ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది. బాంబులకు పిల్లలను దూరంగా ఉంచాలి. ఒక్కోసారి కాకరపూలు కూడా పేలే ప్రమాదముంది. కాబట్టి పిల్లలకు ముందుగా ప్రమాదాల గురించి చెప్పాలి.

టపాసులు కాల్చేటప్పుడు, కాల్చిన తర్వాత చేతులను కళ్లలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకుండా చూడాలి. అలాగే భూ చక్రాలను కాల్చేటప్పుడు పాదరక్షలను ధరించడం మరచిపోవద్దు. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై దించవద్దు. విడి బాంబులు లేదంటే సీరియల్‌గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది. వీటిని కాల్చేటప్పుడు వచ్చిపోయే వారిని గమనించాలి. ముఖ్యంగా థౌజండ్‌వాలా, 10 థౌజండ్‌ వాలా సీరీస్‌ను కాల్చేటప్పుడు జనంలేకుండా చూసుకోవాలి.

మీ దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరువత్తులను ఉంచవద్దు. టపాసులు నాణ్యమైనవి ఎంపిక చేసి లైసెన్సులు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలి. పెద్ద పెద్ద టపాసులు కాల్చే ముందు వాటి ప్యాక్‌లపై ముద్రించి ఉండే సూచనలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు.

వెలిగి పేలకుండానే ఆరిపోయిన చిచ్చుబుడ్లు, బాంబుల వద్దకు వెళ్లి పరిశీలించడం, మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం.పై జాగ్రత్తలను పాటించండి.. దీపావళి పండుగను హాయిగా, ఆనందంగా జరుపుకోండి. జీవితం కష్టసుఖాల కలబోత.. చీకటి వెలుగుల విరిపూత. కష్టాల్లోనూ సుఖాన్ని కలగనడం ఆశాజీవుల లక్షణం..ఇదే చిమ్మచీకట్లను వెలిగించే దివ్యదీపావళి చెబుతున్న సందేశం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios