Asianet News TeluguAsianet News Telugu

చాక్లెట్ డే ను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి.. ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తే సర్ ప్రైజ్ అవుతారో తెలుసా?

ఈ వాలెంటైన్స్ వీక్ లో ప్రతిరోజూ ప్రేమికులకు పండగే. ఎందుకంటే ఈ వీక్ లో ఒక్కో రోజుకు ఒక్కో స్పెషల్ ఉంటుంది. ఈ రోజు చాక్లెట్ డే. ఈ స్పెషల్ డేన ప్రేమికులు ఒకరికొకరు చాక్లెట్లను ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఈ చాక్లెట్ డే సందర్భంగా మీ ప్రియమైన వారికి ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Happy Chocolate Day 2023 Gift Ideas: List of best ideas to celebrate this special day
Author
First Published Feb 9, 2023, 10:36 AM IST

చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ అమ్మాయిలు అయితే చాక్లెట్లను తెగ తింటారు. నిజానికి చాక్లెట్లు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఫీల్ గుడ్ హార్మోన్లను రిలీజ్ చేస్తాయి. అందుకే ప్రేమికులు వీటిని ఎక్కువగా తింటుంటారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. అంతేకాదు చాక్లెట్లతో ఒకరిపై ఉన్న ప్రేమను తెలుపుతుంటారు కూడా.. చాక్లెట్లు మీ కుటుంబం, స్నేహితులు లేదా భాగస్వామితో తీయని సంబంధాన్ని గుర్తు చేస్తాయి.  ఇంతటి మధురమైన రోజున మీ ప్రియమైన వారిని ఎలా సర్ ప్రైజ్ చేయాలి? వారికి ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

చాక్లెట్ బొకేలు: రంగురంగుల పువ్వులు మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకే వాలెంటైన్స్ వీక్ లో మొదటగా రోజ్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఆ రోజున అందమైన రోజా పువ్వు లేదా బొకేను ఇష్టమైన వారికి ఇచ్చి మనసులోని ఫీలింగ్స్ ను చెప్తుంటారు. అలాగే చాక్లెట్ డే సందర్భంగా మీకు ఇష్టమైన వారికి చాక్లెట్ బొకేను ఇవ్వొచ్చు తెలుసా?  ఇలాంటి  చాక్లెట్ బొకేలు బయట దొరుకుతాయి. ఈ చాక్లెట్ బొకేపై మీ ఫీలింగ్స్ ను రాయండి. దీనివల్ల మీ భాగస్వామి పొందే ఆనందం అంతా ఇంతా కాదు తెలుసా. 

చాక్లెట్ బాక్స్

కొన్ని బేకరీలలో మాత్రమే ఫ్యాన్సీ స్వీడిష్ చాక్లెట్లు అందుబాటులో ఉంటాయి. అలాంటివి మీ భాగస్వామికి ఇష్టమైతే ఈ చాక్లెట్ డేన వీటిని ఇచ్చి వారిని సర్ ప్రైజ్ చేయొచ్చు. అందమైన ముద్దుకు మధురమైన చాక్లెట్ తోడైతే.. వచ్చే ఆనందం ఎలా ఉంటుందో ఆలోచించండి.. అయినా ఈ రోజుల్లో మన చుట్టుముట్టూ ఉండే బేకరీల్లో కూడా చాక్లెట్ బాక్స్ అందుబాటులో ఉంటున్నాయి. అది కూడా రకరకాల రుచుల్లో. అందుకే ఈ రోజు మీ భాగస్వామికి నచ్చిన రుచి చాక్లెట్ బాక్స్ ను గిఫ్ట్ గా ఇవ్వండి. ఆ మూమెంట్ ను మీ భాగస్వామి ఎప్పటికీ మర్చిపోదు. 

హోంమేడ్ చాక్లెట్స్: మీ భాగస్వామిని సర్ ప్రైజ్ చేయాలనుకుంటే దీనికంటే ఉత్తమ మార్గం ఏదీ ఉండదేమో. ఎందుకంటే స్వయంగా మీ భాగస్వామికి ఇష్టమైన చాక్లెట్లను తయారుచేస్తే వారి ఆనందానికి అవదులు ఉండవు. నాకోసం తయారుచేశారని ఎంతగానో పొంగిపోతారు. అందుకే వీటిని తయారుచేయడానికి యూట్యూబ్ లేదా స్నేహితుల సహాయం తీసుకోండి. మీ భాగస్వామికి ఎక్కువగా ఏ చాక్లెట్  ఇష్టముంటే అదే తయారుచేయండి. దానిని అందంగా అలంకరించి వారికి ప్రెజెంట్ చేయండి.

హార్ట్ షేప్ లో ఉండే చాక్లెట్లు: వాలెంటైన్స్ వీక్ రోజున ఒకరిపై ఉన్న ఇష్టాన్ని తెలపడానికి పర్ఫెక్ట్ ఎమోజీ ఏదైనా ఉందా? అంటే అది హార్ట్  ఎమోజీ అనే చెప్పాలి. అందుకే ఈ చాక్లెట్ డేన మీ ప్రియమైన వారికి చాక్లెట్లను ఇవ్వాలనుకుంటే గుండె ఆకారంలో ఉండే చాక్లెట్ల తయారుచేయండి. లేదా అలాంటి ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్స్ కొనివ్వండి. 

Follow Us:
Download App:
  • android
  • ios