Asianet News TeluguAsianet News Telugu

ఆ ట్యాబ్లెట్ లను బ్యాన్ చేసిన ప్రభుత్వం

 కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధం విధించినవాటిలో సారిడాన్ లాంటి పెయిన్ కిల్లర్, పాన్‌డెర్మ్ స్కిన్ క్రీం, గ్లుకోనార్మ్ పీజీ అనే కాంబినేషన్ డయాబెటిస్ డ్రగ్, యాంటీ బయోటిక్ లుపీడీక్లాక్స్, యాంటీ బ్యాక్టీరియల్ ట్యాక్సిమ్ ఏజెడ్ లాంటి ఔషధాలు ఉన్నాయి.

Govt bans hundreds of painkillers, creams, antibiotics. 5 things to know
Author
Hyderabad, First Published Sep 14, 2018, 1:38 PM IST


జలుబు, జ్వరం, వొంటి నొప్పులు వచ్చాయంటే మనం ఏం చేస్తాం..? నేరుగా మెడికల్ షాప్ కి వెళ్లి ట్యబ్లెట్స్ ని కొనుక్కోని వేసేసుకుంటాం. చిన్నవే కదా ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకులే అని సొంత వైద్యాన్నే నమ్ముకుంటాం. అయితే.. అలా మనం ఎక్కువగా వేసుకునే పెయిన్ కిల్లర్స్ పై ప్రభుత్వం నిషేధం   విధించింది.

ఆరోగ్యానికి హానికరమైన  సుమారు  328 పెయిన్ కిల్లర్స్, ఫిక్స్‌డ్ కాంబినేషన్ ఉన్న మందులతో పాటు మరో ఆరు ఔషధాలను కేంద్ర ఆరోగ్య శాఖ బ్యాన్ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధం విధించినవాటిలో సారిడాన్ లాంటి పెయిన్ కిల్లర్, పాన్‌డెర్మ్ స్కిన్ క్రీం, గ్లుకోనార్మ్ పీజీ అనే కాంబినేషన్ డయాబెటిస్ డ్రగ్, యాంటీ బయోటిక్ లుపీడీక్లాక్స్, యాంటీ బ్యాక్టీరియల్ ట్యాక్సిమ్ ఏజెడ్ లాంటి ఔషధాలు ఉన్నాయి.

వీటిని వాడితే వెంటనే ఉపశమనం లభించినప్పటికీ దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వాటిపై బ్యాన్ విధిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో సురక్షితం కాని 344 ఔషధాలను 2016లోనే  కేంద్రం నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ పలు ఫార్మా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే 328 ఔషధాల్లో వాడిన పదార్థాలు హానికరంగా ఉన్నాయని, వాటిని బ్యాన్ చేయడంలో ఎలాంటి తప్పిదం లేదని  డ్రగ్ సాంకేతిక సలహా బోర్డు(డీటీఏబీ) స్పష్టం చేసింది. అయితే దగ్గు మందు, జలుబు లాంటి పదిహేను ఉత్పత్తులను మినహాయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios