Asianet News TeluguAsianet News Telugu

జీవన ప్రక్రియను చక్కదిద్దే ‘గరం మసాలా’!

 సరైన మొత్తం ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే జీర్ణం అయ్యేలా, అందుకు అనుగుణంగా గరం మసాలా వాడాల్సిన అవసరం ఉన్నదని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. 

Garam Masala Ingredients & Their Health Benefits

భారతీయ వంటకాల్లో పలు రకాలుగా వినియోగించే సుగంధ ద్రవ్యాల సమ్మేళనం గరం మసాలా. ధనియాలు, ఏలకులు, జీలకర్ర,
దాల్చిన చెక్క, ఆవాలు, లవంగం, ఫెన్నెల్, మిరియాలు, మెంతుల సమ్మేళనంతో తయారు చేసిందే గరం మసాలా. దీనివల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దుకాణం నుంచి కొనుగోలు తెచ్చిన దాని కంటే ఇంట్లో సొంతంగా తయారుచేసుకున్న గరం మసాలా ఉత్కృష్టమైంది. అయితే గరం మసాలా తయారీలో వాడే పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు, ఆయా ప్రాంతాలు, ప్రజల రుచులు, అభిరుచులను బట్టే ఉంటుంది సుమా..

ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వేడిని పుట్టించే సామర్థ్యం కలదే గరం మసాలా. సరైన మొత్తం ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే జీర్ణం అయ్యేలా, అందుకు అనుగుణంగా గరం మసాలా వాడాల్సిన అవసరం ఉన్నదని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. గరం మసాలాలో వాడే వివిధ సుగంధ ద్రవ్యాలతో విడివిడిగా లభించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం..

గరం మసాలాలో వాడే సుగంధ ద్రవ్యాల వల్లే లభించే ఆరోగ్య ప్రయోజనాలివి: జీర్ణశక్తి, బ్లడ్ షుగర్ మరియు కొలెస్ట్రాల్ తగ్గింపు, మల బద్ధకం నివారణ, మధుమేహంపై పోరు, కడుపులో మంటపై పోరు, జీవన ప్రక్రియకు ప్రోత్సాహం, చెడు శ్వాసపై పోరాటం, దంతాల పటిష్ఠం, కడుపుబ్బరంపై పోరు, వృద్ధాప్యం ప్రక్రియ తగ్గింపు

జీర్ణ శక్తి ఇలా మెరుగుదల
గరం మసాలా శరీరంలో వేడితోపాటు జీవన ప్రక్రియను పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. లవంగాలు, జీలకర్ర శరీరంలో ఎసిడిటీ, అజీర్తిని తగ్గించడానికి సహకరిస్తాయి. మిరియాలు, ఏలకులు కూడా జీర్ణ శక్తి మెరుగుదలకు దోహదపడతాయి. 

కొలెస్ట్రాల్ ప్లస్ బ్లడ్ షుగర్ తగ్గింపు
లవంగాలు, మిరియాలు, ఏలకులు, దాల్చిన చెక్క మనిషి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేస్తాయి. దాల్చిన చెక్క 2 టైప్ మధుమేహం, బ్లడ్ షుగర్‌ను తగ్గించి వేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం పెంపుదలపాటు క్యాన్సర్ నిరోధక సామర్థ్యం పెరుగుదలకు దోహద పడుతుంది. ధనియాలు సైతం రక్తంలో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తాయి. 

మలబద్ధకం నివారణ
గరం మసాలా వల్ల కలిగే ప్రయోజనాల్లో మలబద్ధకం నివారణ ఒకటి. గరం మసాలా వాడటంతో సమర్థవంతంగా జీర్ణ శక్తి నడవడానికి సహకరిస్తుంది. తద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగించి వేస్తుంది. 

మధుమేహంపై పోరు ఇలా
దాల్చిన చెక్కలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. దీంట్లో సహజ సిద్ధంగానే మధుమేహం తగ్గింపుతోపాటు బ్లడ్ షుగర్ తగ్గింపునకు శక్తిమంతంగా పని చేస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణకు శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ మెరుగు పడేలా చేస్తోంది. 

ఇలా కడుపు మంట పోరాటం ఇలా
జీలకర్ర గరం మసాలాలో అత్యంత ముఖ్యమైన సుగంధ ద్రవ్యం. ఇందులో యాంటీ ఇన్ ఫ్లేమరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ నిల్వలు పుష్కలం. తద్వారా జీలకర్ర వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అలాగే జీవన ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. ఇందులో ఐరన్ నిల్వలు కూడా బారీగానే ఉన్నాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుదలకు దోహదం చేస్తోంది. 

జీవన ప్రక్రియ పెరుగుదల ఇలా 
గరం మసాలాలో వాడే పదార్థాలన్నీ ఫైటో న్యూట్రియంట్స్. ఇవి జీవన ప్రక్రియ పెరుగుదలకు ప్రోత్సాహాన్నిస్తాయి. ప్రత్యేకించి మిరియాల వల్లే జీవన ప్రక్రియ పెరుగుతూ ఉంటుంది. గరం మసాలాలో వాడే పదార్థాలన్నీ శరీరంలోని వివిధ అవయవాల పనితీరును మెరుగు పరిచేందుకు సహకరిస్తాయి.

చెడు శ్వాసపై పోరు.. దంతాల పటిష్ఠం ఇలా
లవంగాలు, ఏలకుల వాడకం వల్ల చెడు శ్వాసపై పోరాటం తేలికవుతుంది. లవంగాలు ప్రత్యేకించి దంతాల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. దంతాల నొప్పులను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు కాల్షియం, విటమిన్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లవంగాల్లో పుష్కలంగా ఉన్నాయి. 

ఇలా కడుపుబ్బరంపై పోరు
ఇష్టమైన వంటకాలు తింటే కడుపుబ్బరం వేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో గరం మసాలా జీర్ణ ప్రక్రియ మెరుగు పడటంతోపాటు కడుపుబ్బరం తగ్గించడానికి దారి తీస్తుంది. కడుపు ఉబ్బరం నివారణ, వికారం తగ్గింపునకు సహకరిస్తుంది. జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గించడంలో చేయూతనిస్తుంది గరం మసాలా. 

వృద్ధాప్యం ప్రక్రియ తగ్గింపు
వృద్ధాప్యం ప్రక్రియను తగ్గించడంలో గరం మసాలా శక్తిమంతంగా పని చేస్తుంది. దాల్చినచెక్క, మిరియాలు, జీలకర్ర వాడకంతో మరింత బలోపేతం అవుతుంది. మిరియాలు ప్రత్యేకించి స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్‌గానూ, యాంటీ బయాటిక్స్‌కు నిలయంగా వృద్ధాప్యం ప్రక్రియను తగ్గించి వేస్తుందని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios