Asianet News TeluguAsianet News Telugu

తొలి కలయిక కాదు.. అయినా నొప్పి బాధిస్తోందా..?

తొలి కలయిక మీద ఈ అనుమానాలు ఉండటం సర్వ సాధారణం. ఇలాంటి వాళ్లు మరీ ఎక్కువ భయంగా అనిపిస్తే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఇక బరువు ఎక్కువగా ఉండటమే మీ సమస్య అనుకుంటే... సరైన డైట్ ఫాలో అయ్యి.. రోజూ ఓ గంట వ్యాయామం చేస్తే సరిపోతుంది.

For Women: Why Do I Feel Pain During coupling
Author
Hyderabad, First Published Aug 19, 2019, 2:33 PM IST

భార్య భర్తల మధ్య అనుబంధం పెరగడానాికి, ఒకరినొకరు అర్థదం చేసుకోవడానికి... జీవితం ఆనందంగా, సాఫీగా సాగిపోవాలంటే వారి లైంగిక జీవితం సాఫీగా సాగాలంటున్నారు నిపుణులు. సాధారణంగా తొలి కలయిక బాధిస్తుంది. తొలిసారి కాబట్టి... అది నొప్పిగా ఉంటుంది. కానీ... తరచూ శృంగారంలో పాల్గొంటున్నా కూడా నొప్పి బాధిస్తుందంటే.. దానికి కారణాలు తెలుసుకోవాల్సిందే.

సాధారణంగా చాలా మంది దంపతుల్లో కలయిక పట్ల భయం ఉంటుంది. ఆ భయం కారణంగానే వారు అసౌకర్యంగా ఫీలౌతుంటారు. ఈ క్రమంలోనే శృంగారాన్ని పూర్తిగా ఆశీర్వదించలేరు. ముందు అసౌకర్యానికి గురౌతారు. ఆ తర్వాత నొప్పి ఉంటుందేమో... తాము సరిగా స్పందించలేమేమో, బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఆనందించలేమో ఇలా లేనిపోని అనుమానాలు పెంచుకుంటారు. 

తొలి కలయిక మీద ఈ అనుమానాలు ఉండటం సర్వ సాధారణం. ఇలాంటి వాళ్లు మరీ ఎక్కువ భయంగా అనిపిస్తే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఇక బరువు ఎక్కువగా ఉండటమే మీ సమస్య అనుకుంటే... సరైన డైట్ ఫాలో అయ్యి.. రోజూ ఓ గంట వ్యాయామం చేస్తే సరిపోతుంది.

తొలి కలయిక కాకపోయినా.. తరచూ శృంగారంలో పాల్గొంటున్నా కూడా చాలమందికి యోనిలో నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఆ నొప్పి కారణంగా వారు కలయికను ఆస్వాదించలేరు. అలాంటివారు కారణం ఏమైఉంటుందో కచ్చితంగా తెలుసుకోవాలి.

కొందరిలో జననాంగాలు పొడిబారతాయి. మోనోపాజ్ దశలోనూ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల ఈ సమస్య ఎదురౌతుంది. మోనోపాజ్ తర్వాత యోనిమార్గంలోని పొర పల్చగా మారుతుంది. ఆ భాగం పొడిబారడం వల్ల నొప్పి వేధిస్తుంది. అలాంటప్పుడు వైద్యులను సంప్రదిస్తే పరిష్కారం ఇట్టే లభిస్తుంది.

ఇన్ ఫెక్షన్లు, గర్భాశయ ముఖద్వారానికి సంబందించిన సమస్యలు ఉన్నా కూడా ఇలా కావొచ్చు. ముఖ్యంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఈ నొప్పి కి కారణం కావొచ్చు. అండాశయాల్లో సిస్టులు ఉన్నా.. ఎండోమెట్రియం పొర గర్భాశయంలో కాకంుడా బయట పెరిగా ఇలా నొప్పి, మంట వేధిస్తూ ఉంటుంది. సమస్యను బట్టి చికిత్స ఉంటుంది.

కొందరికి  ప్రసవ సమయంలో యోని భాగంలో గాయాలౌతుంటాయి. దాని వల్ల కూడా నొప్పి బాధించొచ్చు. లేదా లైంగికంగా సక్రమించే వ్యాధులు ఉండొచ్చు. వాటివల్ల దంపతులు ఇద్దరూ ఇబ్బందిపడాల్సి ఉంటుంది. కాబట్టి కండోమ్ వాడటం ఉత్తమం. ఇవన్నీ కాకుండా కూడా ఈ సమస్యను మిమ్మల్ని వేధిస్తుంటే.. సెక్స్ థెరపీతో సమస్యను అధిగమించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios