శరీరంలో విటమిన్ల లోపం ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడమే కాదు జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే జుట్టు రాలే అవకాశమే ఉండదు.
అందమైన, పొడవైన జుట్టును కోరుకోని వారు ఎవరూ ఉండదు. కానీ ఇలా కోరుకున్న జుట్టు నూటిలో ఏ ఒక్కరికో ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి ఆరోగ్యకరమైన ఫుడ్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అవును నూనెలు, షాంపూలతో కాదు ఆరోగ్యకరమైన ఆహారంతో మీ జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరుగుతుంది. నిజానికి మన శరీరంలో పోషకాలు లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. అందుకే విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం ఆగేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బచ్చలికూర
బచ్చలికూర ఆరోగ్యానికే కాదు జుట్టు పెరుగుదలకు, హెయిర్ ఫాల్ ను ఆపేందుకు కూడా సహాయపడుతుంది. బచ్చలికూర విటమిన్ల భాండాగారం. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం లు ఉంటాయి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరను రోజూ తినండి.
గుడ్లు
గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో బయోటిన్, జింక్ లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాదు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే రోజూ ఒక గుడ్డును తినండి. మీ వెంట్రుకలు పెరిగే అవకాశం తగ్గుతుంది.
బాదం
బాదం మన శరీరానికి, చర్మానికి, వెంట్రుకలకు ప్రయోజనకరంగా ఉంటుంది. బాదం పోషకాల భాండాగారం. దీనిలో ప్రోటీన్, ఐరన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జింక్, విటమిన్ ఇ, విటమిన్ బి 1, విటమిన్ బి 6 లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు ఊడటాన్ని ఆపి జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడతాయి.
ఖర్జూరాలు
ఖర్జూరాలు కూడా జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. .
వేరుశనగలు
వేరుశెనగలు కూడా జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది.
