Asianet News TeluguAsianet News Telugu

వారానికి మూడు రోజులు చేప తింటే... క్యాన్సర్ దూరం

అన్ని రకాల చేపలు శరీరానికి మంచి చేస్తున్నప్పటికీ... సాల్మన్, మాకరేల్ చేపలు మాత్రం కాస్త దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు రకాల చేపల్లో నూనెలు అధికంగా ఉన్నాయని.. అవి అంత మంచిది కాదని సూచిస్తున్నారు.

Eating Fish Reduces Risk of Colorectal Cancer, Says Study
Author
Hyderabad, First Published Jul 29, 2019, 2:39 PM IST

వారంలో మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే... వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు  చెబుతున్నారు. వారానికి ఒకసారి చేప తినేవారితో పోలిస్తే... మూడు సార్లు తినేవారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12శాతం తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. అన్ని రకాల చేపలు శరీరానికి మంచి చేస్తున్నప్పటికీ... సాల్మన్, మాకరేల్ చేపలు మాత్రం కాస్త దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు రకాల చేపల్లో నూనెలు అధికంగా ఉన్నాయని.. అవి అంత మంచిది కాదని సూచిస్తున్నారు.

చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలోని వాపును తగ్గిస్తాయని యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. శరీరంలో వాపు ప్రక్రియ డీఎన్ఏను ధ్వంసం చేస్తుంది. దీంతో క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉంది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ , ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంయుక్తంగా ఈ పరిశోధనలు  చేశాయి.

తరచూ చేపలను తినేవారిలో పేగు క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గినట్లు వైల్లడైందని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంలో చేపలది పెద్ద పాత్ర అని నిపుణులు చెబుతున్నారు. పొగతాగే అలవాటు ఉన్నవారు వాటిని పూర్తిగా తగ్గించుకుంటే మంచిదని.. బరువు ఎక్కువగా ఉన్నా కూడా దానిని తగ్గించుకుని... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే... 40శాతం క్యాన్సర్ వచ్చే సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios