Anise: భోజనం చేసిన తర్వాత చాలా మంది సోంపు గింజలను నములుతూ ఉంటారు. హోటల్ కి వెళ్లినప్పుడు కూడా వీటీని మనముందు పెడుతుంటారు. ఇంతకీ సోంపు గింజలను తింటే ఏమౌతుందో ఎంతమందికి తెలుసు..  

Anise: భోజనం చేసిన తర్వాత పక్కాగా సోంపు గింజలను తినడం చాలా మందికి అలవాటు. మనం హోటల్లకు, రెంస్టారెంట్లకు వెళ్లినప్పుడు కూడా వీటిని మన ముందు పెడుతుంటారు. మరి ఈ సోంపును తినడం వల్ల మనకు ఏ విధంగా మంచి జరుగుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

సోంపు గింజల్లో కాల్షియం, ఖనిజాలు, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. సోంపు గింజలను పేస్ట్ గా చేసి స్కిన్ పై అప్లై చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు మటుమాయం అవుతాయి. అంతేకాదు ఈ సోంపు ఆక్సిజన్ సమతుల్యంగా ఉండేలా సహాయపడుతుంది. 

సోంపు ను నిత్యం తినడం వల్ల స్కిన్ డ్రైగా మారదు. చర్మంపై దద్దుర్ల సమస్యలు కూడా ఏర్పడవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారుు. 

సోంపు గింజల్లో Anti-inflammatory లక్షణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మన బాడీలో ఉండే బ్యాక్టీరియాను, వైరస్ లను బయటకు పంపుతుంది. 

సోంపులో ఉండే ఫైబర్ మన శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. అంతేకాదు వీటిలో ఎస్ట్రోగోల్, ఫెన్ కాన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, అజీర్థి , మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

సోంపు గింజలను తింటే బరువు పెరుగుతామన్న భయం కూడా ఉండదు. అంతేకాదు ఈ గింజల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగ్గా చేస్తుంది. 

సోంపు గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని అన్నం తిన వెంటనే తింటే అది తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు ఇది గుండె ఆరోగ్యంగా ఉండేలా ఎంతో సహాయపడుతుంది కూడా.