దిండు దగ్గర నిమ్మకాయ పెట్టుకుని పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
నిమ్మకాయ వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. కానీ అదే నిమ్మకాయ ముక్కను తల దిండు దగ్గర పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు తెలుసా?
పుల్ల పుల్లని నిమ్మకాయలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఎన్నో రోగాలకు దూరంగా ఉంచే విటమిన్ సి నిమ్మకాయలో మెండుగా ఉంటుంది. అందుకే దీని జ్యూస్ ను తాగితే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని అంటారు. ముఖ్యంగా నిమ్మకాయ మన జీవక్రియను పెంచడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
అంతేకాదు నిమ్మకాయలోని పరిమళం మన మూడ్ ను వెంటనే రీఫ్రెష్ చేస్తుంది. అయితే ఇదే నిమ్మకాయ ముక్కను మీరు నిద్రపోయేటప్పుడు దిండు దగ్గర పెట్టుకుని పడుకుంటే మీరు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇది మీకు సిల్లీగా అనిపించొచ్చు. కానీ దీనివల్ల మీరు మానసిక, శారీరక ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నాసికా రద్దీ నుంచి ఉపశమనం
ముక్కు మూసుకుపోవడం వల్ల రాత్రిళ్లు అస్సలు నిద్రరాదు. ఎటూ తోచదు కూడా. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి నిమ్మకాయ బాగా సహాయపడుతుంది. మీరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నిమ్మకాయను మీ తలదగ్గర పెడితే మీరు బాగా శ్వాస తీసుకోగలుగుతారు. నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మూసుకుపోయిన ముక్కును తెరవడానికి సహాయపడతాయి. అలాగే మీరు శ్వాస సులువుగా తీసుకునేలా చేస్తాయి. సైనస్, ఉబ్బసం వంటి వ్యాధులు ఉన్నవారికి ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది. ఇది ఛాతీ బిగుతును తగ్గిస్తుంది.
రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిమ్మకాయ మన శరీరంలో రక్త ప్రసరణను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు నిద్రపోయేటప్పుడు ఒక నిమ్మకాయ ముక్కను రాత్రంతా మీ తల దగ్గర పెడితే దీని వాసన మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచి హైబీపీని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది
నిమ్మకాయ వాసన స్ట్రెస్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు తెలుసా? అరోమాథెరపీలో నిమ్మకాయను 'స్ట్రెస్ బస్టర్' అంటారు. దీనివాసన మన మెదడులో హ్యాపీ కెమికల్ 'సెరోటోనిన్' ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ తగ్గిపోతాయి. దిండు దగ్గర నిమ్మకాయను పెట్టుకుని పడుకోవడం వల్ల మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు.
దోమలు రాకుండా చేస్తుంది
నిద్రపోతున్నప్పుడు దోమల శబ్దం నిద్రపట్టుకుండా చేస్తుంది. చిరాకు కలిగిస్తుంది. అంతేకాకుండా ఇవి కుట్టడం వల్ల నిద్రకూడా డిస్టబెన్స్ అవుతుంది. అయితే ఈ దోమల బెడదను తగ్గించడానికి నిమ్మకాయ ముక్క బాగా పనిచేస్తుంది. అవును రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక నిమ్మకాయ ముక్కను తలదగ్గర పెట్టుకుంటే మీ దగ్గరికి దోమలు అస్సలు రావు. ఎందుకంటే నిమ్మకాయ వాసన దోమలకు అస్సలు నచ్చదు.
గాలి నాణ్యత మెరుగుపడుతుంది
ప్రస్తుతం గాలి కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. అయితే ఈ గాలి కాలుష్యం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కాపాడాలనుకుంటే మీరు ఈ నిమ్మకాయ ట్రిక్ ను ఫాలో కావాల్సిందే. అవును నిమ్మకాయ ముక్కను దిండు దగ్గర పెట్టుకుని పడుకుంటే గాలి నాణ్యత పెరుగుతుంది. నిమ్మకాయ మీ చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేస్తుంది. దీంతో మీరు రాత్రిపూట బాగా నిద్రపోగలుగుతారు.