Pulse polio: ఐదేండ్ల లోపున్న పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే భయకరమైన పోలియో అనే వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా పిల్లలకు పోలియో చుక్కలను వేయించాలి. మరి ఈ పోలియో చుక్కలను వేయించకపోతే ఏమౌతుందో తెలుసా..
Pulse polio: పిల్లల నిండు జీవితాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. ఐదేండ్ల లోపు పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలను వేయించాలని ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాయి. పోలియో వ్యాధి రహిత దేశంగా తయారుచేసేందుకే ప్రభుత్వం ప్రతి యేటా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రణాలికా బద్దంగా చేపడుతోంది. అయితే ఈ పోలియో చుక్కలు ఎందుకు వేయించాలి? వేయిస్తే ఏమౌతుంది? అంటూ చాలా మందికి సందేహాలు వస్తుంటారు. వేయించకపోతే ఏమీ కాదు అన్న ధోరణితో పిల్లలకు నేటికీ పోలియో చుక్కలను వేయించని వారు చాలా మందే ఉన్నారు. ఈ కారణంగా ఎంతో మంది పిల్లలకు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఈ పోలియో చుక్కల వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి..
Poliomyelitis అనే వైరస్ ద్వారా పోలియో అనే వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ వైరస్ రెండు రకాలుగా సోకుతుంది. ఒకటి అపరిశుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల. ఈ ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి క్రిములు కడుపులోకి వెళ్లి పోలియో సోకుతుంది. ఇక రెండో రకం ఏమిటంటే.. పోలియో వ్యాధికి కారణమయ్యే క్రిములు గొంతులోకి ప్రవేశించడం ద్వారా.
ఈ క్రిములు రోగి కడుపులోకి ప్రవేశించి మలంలో ఎక్కువగా బహిర్గతం అవుతూ ఉంటాయి. అపరిశుభ్రంగా ఉండటం, చేతులు, కాళ్లూ సరిగ్గా కడుక్కోకపోడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రోగి దగ్గినప్పుడు ఇతరులకు కూడా చేరే అవకాశం ఉంది.
గొంతులోని, కడుపులోని ఈ వ్యాధి క్రిములు ఒకే సారి ప్రవేశిస్తే.. మన శరీరంలో ఇవి అధిక సంఖ్యలో వృద్ది చెందుతాయి. తద్వారా అవి రక్తంలో కలిసిపోతాయి. ఇవి జీవకణాలను దెబ్బతీస్తాయి. దీంతో నాడీ మండలం పూర్తిగా దెబ్బతిని కదలలేని విధంగా కండరాలు బిగుసుకు పోతాయి.
లక్షణాలు: పోలియో వైరస్ గొంతులోకి ప్రవేశించినప్పుడు గొంతులో శ్లేష్మం తయారవుతుంది. అలాగే తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి సమస్యలు తలెత్తుతాయి. దీని తర్వాత శ్వాస కోస సమస్యలు, కండరాలు బలహీనంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో మెడ సక్కగా నిలబడదు. అంతేకాదు దాంతో మెడ వాలిపోతుంది.
ఈ వ్యాధి ఎక్కువగా ఒకటి , రెండేండ్ల పిల్లలకే ఎక్కువగా వస్తుంది. ఇక్కడే ఒక విచిత్రం ఏమంటే.. అపరిశుభ్రమైన వాతావరణం అంటే గుడిసెలు, మురికి వాడల్లో పుట్టి పెరిగే పిల్లలకు ఈ వ్యాధి సర్వసాధారణం. ఈ వ్యాధిని ఎదుర్కొనే ఇమ్యూనిటీ పవర్ వారిలో ఉంటుంది. ఎందుకంటే అపరిశుభ్రమైన ప్లేసెస్ లో ఉండే ఆహార పదార్థాలను, పానియాలను తీసుకోవడం వల్ల ఆ పిల్లల్లో ఈ వ్యాధి క్రిములు కొద్ది కొద్దిగా వారి శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఈ వ్యాధి కారకాలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఏర్పడి వాటిని క్రిములను చంపేస్తూ ఉంటాయి.
అదే పరిశుభ్రమైన వాతావారణంలో పెరిగిన పిల్లల్లో ఇలా జరగదు. వీళ్లల్లో ఆ వ్యాధి క్రిములను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వీరిలో ఉండదు. ఆ వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వాటిని చంపేయడానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ వీరిలో ఏర్పడే అవకాశమే లేదు. కాబట్టి ఈ వ్యాధి క్రిములు పిల్లల శరీరంలోకి ప్రవేశించి పోలియో జబ్బు వస్తుంది.
వ్యాధి తీవ్రత: పోలియో వ్యాధి క్రిములు ఒక 48 గంటల్లో చాలా వేగంగా ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఈ వ్యాధి తీవ్రత ఒకటి రెండు రోజులు మామూలుగానే ఉంటుంది. ఒక వారం రోజుల్లోనే ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. నాడీ మండలం దెబ్బతినడం, కండరాలు దెబ్బతిని బలహీన పడతాయి. అప్పుడే వ్యాధి తీవ్రత ఎక్కువైందని అర్థం చేసుకోవాలి. మెల్లిమెల్లిగా వ్యాధి ముదురుతుంటే కండరాలు దెబ్బతిని కుంచించుకుపోవడం, బిగుసుకుపోవడం జరుగుతూ ఉంటాయి. ఈ ప్లేసెస్ ను తాకినప్పుడు తీవ్రమైన నొప్పి పుడుతుంది.
వ్యాధి తీవ్రతరమైనప్పుడు శ్వాసకోశాన్ని కదల్చే కండరాలు, మెడ కండరాల తాలుకు జీవకణాలు పూర్తిగా దెబ్బతింటే మెడ నిలబదు. పూర్తిగా వాలిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే పనిచేయదు. Lung కూడా పనిచేయదు. కొన్ని సందర్భాల్లో అయితే శ్వాసకోస కండరాలు పూర్తిగా బిగుసుకుపోతాయి. ఈ వ్యాధి వల్ల పక్షపాతం కూడా రావొచ్చు.
