దీపావళి 2023: టపాసులు పేల్చేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకండి.. లేదంటే?
Diwali 2023: దీపావళి నాడు ఇంటినిండా దీపాలను వెలిగించడం, కొత్త బట్టలను వేసుకోవడం, టపాసులను పేల్చడం చాలా కామన్. కానీ దీపాలను వెలిగించేటప్పుడు, టపాసులను కాల్చేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఎంతో నష్టం జరుగుతుంది. అందుకే ఈ రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అవేంటంటే?
Diwali 2023: దీపావళి అంటేనే దీపాల పండుగ. అందుకే కదా ఆరోజు ఇళ్లు, వాకిలి నిండా దీపాలను వెలిగిస్తారు. అంతేకాదు ఈ పండుగకు ఏది ఏమైనా ఖచ్చితంగా టపాకాయలను మాత్రం పేల్చుతారు. పటాకాయలను పేల్చుతుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే కొంతమంది తెల్లవార్లూ టపాకాయలను పేల్చుతుంటారు. ఇదంతా బానే ఉన్నా.. టపాకాయలను కాల్చేటప్పుడు, దీపాలను వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద నష్టమే జరగొచ్చు. ఇందుకోసం దీపావళి నాడు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
దీపావళి నాడు చేయకూడని పనులు
- టపాసులను చేతిలో పెట్టుకుని కాల్చకూడదు.
- కొవ్వొత్తులు, దీపాలున్న చోటే బాణసంచా కాల్చకూడదు.
- విద్యుత్ స్తంభాలు, వైర్ల దగ్గర టపాసులను పొరపాటున కూడా పేల్చకూడదు.
- ముఖ్యంగా సగం కాలిపోయిన టపాసులను వెంటనే వెళ్లి ముట్టుకోకూడదు. ఎందుకంటే అవి కొద్దిసేపటి తర్వాత పేలే అవకాశం ఉంది.
- టపాసులను పేల్చేటప్పుడు సిల్క్, సింథటిక్ ఫ్యాబ్రిక్ ను అస్సలు వేసుకోకూడదు. టపాసులు పేల్చడానికి ఓపెన్ ఫైర్ అంటే అగ్గిపెట్టెలు లేదా లైటర్లును అస్సలు ఉపయోగించకండి. టపాసులు పేల్చడానికి స్పార్క్లర్, పొడవైన ఫైర్ వుడ్ లేదా అగర్బత్తిని ఉపయోగించడం మేలు.
- టపాసులను దగ్గరి నుంచి అస్సలు పేల్చకండి. టపాసులు పేలడానికి ఎక్కువ సమయం పడితే వాటిని ట్యాంపరింగ్ చేయకండి. క్రాకర్ కు సురక్షితమైన దూరంలో ఉండండి. ఒకవేళ అవి పేలకుంటే వెంటనే ముట్టుకోకుండా వాటిపై నీళ్లు జల్లండి.
- వీధి జంతువుల దగ్గర, రోడ్డుపై, ఆసుపత్రుల దగ్గర టపాసులను అస్సలు పేల్చకండి.
- పేలని టపాసులను కాల్చకపోవడమే మంచిది.
- విపరీతంగా గాలులు వీస్తున్నప్పుడు ఎగిరే బాణసంచాను కాల్చకండి.
- చాలా మంది బాటిల్స్, సీసాలు వంటి రకరకాల కంటైన్ లో క్రాకర్స్ ను పేలుస్తుంటారు. కానీ ఇది మంచిది కాదు. అందుకే ఇలా చేయకండి.
- ముఖ్యంగా ఇంట్లోనే క్రాకర్స్ ను తయారుచేసే ప్రయత్నం అస్సలు చేయకండి.
- వదులుగా వేలాడుతున్న బట్టలను వేసుకోకూడదు. క్రాకర్స్ పేలుస్తున్నప్పుడు మీ బట్టను జాగ్రత్తగా చూసుకోండి. వాటికి నిప్పు అంటుకునే అవకాశం ఉంది.
- జేబుల్లో క్రాకర్స్ ను పెట్టకండి. మీరు పొరపాటున స్మోకింగ్ చేస్తే.. అవి పేలే అవకాశం ఉంది.