ధన త్రయోదశి అంటే బంగారం కొనమని అర్ధం కాదు. ఈ రోజు అమ్మవారికి ఇంట్లో ఉన్న బంగారు నగలతో అలంకరించి భక్తితో పూజించమని అర్ధం. చాలా మంది తెలియక తమ వద్ద డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పుచేసి మరీ బంగారం కొంటున్నారు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర ఆశ్వీయుజ బహుళ 'నరక' చతుర్దశి, తేదీ 14 నవంబర్ 2020 శనివారం రోజు సూర్యోదయానికి పూర్వం 'మబ్బున' 4 గంటల నుండి ఉదయం 5: 55 లోపు లేదా ఉదయం 8 నుండి10 గంటల వరకు బుధ, శుక్ర హోరలో మంగళ హారతులు ( మంగళ స్నానం, హారతులు ) జరుపుకోవడానికి శుభ సమయం. ఈ ముహూర్తం పంచాంగ కర్తల నిర్ణయం కావున హారతులు నిర్ణీత సమయంలోపల తీసుకోవాలి.

ధన త్రయోదశి :- తేదీ13-11-2020 శుక్రవారం రోజు ధనత్రయోదశి. ధన త్రయోదశి అంటే బంగారం కొనమని అర్ధం కాదు. ఈ రోజు అమ్మవారికి ఇంట్లో ఉన్న బంగారు నగలతో అలంకరించి భక్తితో పూజించమని అర్ధం. చాలా మంది తెలియక తమ వద్ద డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పుచేసి మరీ బంగారం కొంటాన్నారు. ధన త్రయోదశి రోజు ఒక గ్రాము బంగారమైన కొనకపోతే ఎలా అని చాదస్తపు ధోరణితో వ్యవహరిస్తారు. వ్యాపారవేత్తలు వారి జిమ్మిక్కులతో వాళ్ళ వ్యాపార పబ్బం గడవడానికి ఇవన్ని, ఇలాంటి లేనిపోని పద్దతులను సృష్టిస్తారు. కేవలం ఇది మార్కట్ మాయాజాలం అని గ్రహించండి ... శాస్త్రంలో ఎక్కడ ధన త్రయోదశి రోజు బంగారం కొనమని చెప్పబడలేదు.   
 
దీపావళి ధనలక్ష్మి పూజలు:- తేదీ 14 నవంబరు 2020 శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 వరకు ధనలక్ష్మీ పూజలు జరుపుకొనుటకు సిద్ధాంతులు తీర్మానించడమైనది.

కేదారీశ్వరస్వామి వారి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకునే వారు తేదీ 15 నవంబరు 2020 ఆదివారం రోజు వ్రతం జరిపించుకోవాలి.                                                    దీపావళి నోములు :- ఈ దీపావళి నోములు:- తేదీ15-11-2020 ఆదివారం రోజు నోములు, 

మూరత్ "పాడ్వ' ముహూర్తములు :- కార్తీకమాసం తేదీ 16 నవంబరు 2020 సోమవారం,శుక్లపక్ష విదియ తిధి ఉదయం 8 : 20 నుండి ఉదయం10 : 00 వరకు నూతన వ్యాపార ప్రారంభం ( మూరత్ ) చేసుకోవాలి.

ముఖ్య విషయం :- తేదీ 6 నవంబర్ 2020 నుండి విశాఖ కార్తె ప్రారంభమై 18 నవంబర్ వరకు ఉంటుంది. ఈ కార్తె సమయంలో దీపావళి పండగకు కొత్త అల్లుండ్లను తీసుకురాకూడదు. మరియు ఓడి బియ్యం పోయడం, నోములు నోచుకోకూడదు అనే అంశం తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ ఆచారంగా కొన్ని చోట్లనే  అనుసరిస్తున్నారు. ఇలానే చేయాలి, ఇలా చేయకూడదు అనే శాస్త్రీయ ప్రామాణిక ఆధారం ఎక్కడ కనబడటం లేదు. ఇది ఒక ప్రాంతానికి సంబంధినది కావున మీ ప్రాంతంలోని ప్రధాన పురోహితుని సూచనల మేరకు వ్యవహరించగలరు.