Asianet News TeluguAsianet News Telugu

జామ ఆకులను ఇలా వాడితే జుట్టు ఊడిపోయే ప్రసక్తే ఉండదు.. ఈ ఆకులతో ఎన్ని లాభాలున్నాయో..!

జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు  ఇవి మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయంటున్నారు నిపుణులు. జుట్టు రాలడాన్ని తగ్గించడం నుంచి చుండ్రును తగ్గించడం వరకు ఎన్ని లాభాలను పొందుతారో తెలుసా..? 
 

Discover the incredible hair benefits of guava leaves!
Author
First Published Mar 18, 2023, 9:39 AM IST

హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ మన అందాన్ని పెంచడమే కాకుండా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయినప్పటికీ.. ఆరోగ్యకరమైన జుట్టును మెయింటైన్ చేయడం అంత సులువైతే కాదు. వాయు కాలుష్యం, జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, హెయిర్ చికిత్సలు, స్టైలింగ్ ఉత్పత్తులు వంటివి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో జుట్టును జుట్టును ఆరోగ్యంగా ఉంచొచ్చు. అందులో జామ ఆకులు ఒకటి. నిపుణుల ప్రకారం.. జామ ఆకులు జుట్టు సమస్యలను పోగొడుతాయి. జుట్టుకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. అసలు జామ ఆకులు మన జుట్టుకు ఎలా మేలు చేస్తాయంటే..? 

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

ఒత్తిడి, పేలవమైన పోషణ, హార్మోన్ల అసమతుల్యత వంటి వివిధ కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. జామ ఆకుల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. విటమిన్ బి జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తుంది. ఈ విటమిన్ కుదుళ్లను బలంగా చేస్తుంది. వెంట్రుకలు రాలిపోయే అవకాశాన్ని తగ్గిస్తుంది. జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

జామ ఆకులు జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడతాయి. ఈ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజెన్ అనేది ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడుతుంది. జామ ఆకు నూనెను జుట్టుకు రాయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. అలాగే జుట్టును మందంగా చేయడానికి సహాయపడుతుంది. 

చుండ్రును తగ్గిస్తుంది

చుండ్రు ఏర్పడటానికి కారణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇది నెత్తిమీద ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా నెత్తి పొడిగా ఉన్నా వస్తుంది. కాగా  జామ ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించడానికి సహాయపడతాయి. జామ ఆకులు చుండ్రు వల్ల కలిగే దురదను తగ్గిస్తాయి. మంటను నుంచి ఉపశమనం కలిగించే ఆస్ట్రిజెంట్ లక్షణాలు కూడా ఈ ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. 

జుట్టుకు జామ ఆకులను ఎలా ఉపయోగించాలి

జామ ఆకు టీ

ముందుగా  గుప్పెడు జామ ఆకులను ఒక లీటరు నీటిలో 20 నిమిషాల పాటు మరిగించండి. ఈ టీ ని బాగా చల్లబరచండి. తర్వాత దీనిని మూలాల నుంచి చివర్ల వరకు జుట్టంతా పెట్టండి. గంట సేపు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.

జామ ఆకు నూనె

ఇందుకోసం ముందుగా గుప్పెడు జామ ఆకులను మెత్తగా నూరి కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు వేడి చేసి ఆకులను వడకట్టండి. ఈ నూనెను మీ జుట్టు, నెత్తిమీద అప్లై చేసి కొద్ది సేపు మసాజ్ చేయండి. ఒక గంట పాటు అలాగే వదిలేయండి. తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయండి. మీరు రెగ్యులర్ గా పెట్టే షాంపూను జుట్టుకు పెట్టండి. 

Follow Us:
Download App:
  • android
  • ios