Asianet News TeluguAsianet News Telugu

డయాబెటీస్ పేషెంట్లకే లాంగ్ కోవిడ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందా?

ఒక పైపు మంకీపాక్స్, టొమాటో ఫ్లూ మధ్యలో కోవిడ్ -19 కేసులు దారుణంగా నమోదవుతున్నాయి. అందులో డయాబెటీస్ ఉన్నవారికి దీర్ఘకాలిక కోవిడ్-19 ప్రమాదం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. 
 

diabetes may increase long covid risk says study
Author
Hyderabad, First Published Jun 11, 2022, 2:52 PM IST

గత రెండేళ్లుగా కరోనా వైరస్ మన జీవితాల్ని దుర్భరంగా మార్చుకుంటూ వచ్చింది. ఈ మహమ్మారి బారిన పడి లక్షలాది మంది మరణించారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న చాలా మంది ఇప్పటికీ వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్న సమయంలో లోనే.. కోవిడ్ మళ్లీ వ్యాపించడం ప్రారంభమైంది. ఇంతలో అధ్యయన బృందం ఒక భయంకరమైన విషయాన్ని వెల్లడించింది. అధ్యయనం ప్రకారం.. మధుమేహం దీర్ఘకాలిక కోవిడ్ (long covid) ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతోంది.

కోవిడ్ -19 రోగులలో డయాబెటిస్ ఉన్నవారు ఆసుపత్రిలో చేరిన ఏడు రోజుల్లోపు చనిపోవచ్చు. ప్రతి ఐదుగురిలో ఒకరికి ట్యూబ్, వెంటిలేటర్ అవసరం కావచ్చని గతంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న సమయంలో నిపుణులు తెలిపారు. ఫ్రాన్స్ లోని నాంటెస్ విశ్వవిద్యాలయానికి (Nantes University)చెందిన పరిశోధకులు 2020 మార్చి 10 నుంచి 31 వరకు 53 ఫ్రెంచ్ ఆసుపత్రుల్లో చేరిన 1,317 మంది కోవిడ్-19 రోగుల డేటాను విశ్లేషించారు.

ఈ రోగులలో చాలా మందికి సుమారు 90 శాతం టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్టు.. కేవలం 3 శాతం మందికి మాత్రమే టైప్ 3 డయాబెటిస్ ఉందని తెలిపారు. మిగిలిన కేసులలో ఇతర రకాల డయాబెటిస్ ఉంది. కొత్త అధ్యయన బృందం కూడా విషయాన్ని వెల్లడించింది.

కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత కనీసం నాలుగు వారాల పాటు ప్రజలను ట్రాక్ చేసిన అధ్యయనాలను పరిశోధకులు సమీక్షించారు. మెదడు పొగమంచు ( brain foggy), చర్మ సమస్యలు, నిరాశ (Disappointment)మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లాంగ్ కోవిడ్-సంబంధిత లక్షణాలను అభివృద్ధి చేసే వ్యక్తులను గమనించారు. మూడు అధ్యయనాలలో డయాబెటిస్ లేని వ్యక్తులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్న వ్యక్తులు దీర్ఘకాలిక కోవిడ్ సమస్యను అభివృద్ధి చేసే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు. 

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ యొక్క వార్షిక శాస్త్రీయ సెషన్ల ప్రకారం.. దీర్ఘకాలిక కోవిడ్ కు మధుమేహం శక్తివంతమైన ప్రమాద కారకం అని పరిశోధకులు చెబుతున్నారు. కానీ వారి పరిశోధనలు ప్రాథమికమైనవి. ఎందుకంటే అధ్యయనాలు వేర్వేరు పద్ధతులను, దీర్ఘకాలిక కోవిడ్ యొక్క నిర్వచనాలను మరియు అనుసరణీయత సమయాన్ని ఉపయోగించాయి. దీర్ఘకాలిక కోవిడ్ కు మధుమేహం నిజంగా ప్రమాద కారకం కాదా అని తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని చెబుతున్నారు.

డయాబెటోలోజియా జర్నల్ లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. డయాబెటిస్ ఉన్న కోవిడ్ రోగులలో మూడింట రెండు వంతుల మంది పురుషులు మరియు అందరూ సగటున 70 సంవత్సరాల వయస్సు గలవారు. రక్తంలో చక్కెర నియంత్రణ రోగి యొక్క ఫలితాన్ని నేరుగా ప్రభావితం చేయదని పరిశోధకులు కనుగొన్నారు, కానీ డయాబెటిస్ సంక్లిష్టతలు మరియు వృద్ధాప్యం మరణ ప్రమాదాన్ని పెంచాయని పరిశోధనలో వెల్లడైంది.

47 శాతం మందికి కంటి, మూత్రపిండాలు, నరాలతో సమస్యలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. కానీ 41 శాతం మంది రోగులకు గుండె, మెదడు మరియు పాదాల సమస్యలు ఉన్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరిని ఏడో రోజు వరకు వాస్కులర్ చేసి ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేటర్లపై ఉంచాల్సి వచ్చిందని పరిశోధకులు తెలిపారు. ఈ సమయానికి ప్రతి 10 మందిలో ఒకరు మరణించారని, 18 శాతం మంది కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారని పరిశోధనలో తేలింది.

Follow Us:
Download App:
  • android
  • ios