Asianet News TeluguAsianet News Telugu

జీవనశైలితోపాటు మెరుగైన భోజనంతోనే మధుమేహం నియంత్రణ

ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మధుమేహం వ్యాధితో బాధపడటం సర్వ సాధారణంగా మారింది. బ్లడ్ లో షుగర్ (గ్లూకోజ్) లెవల్స్ దీర్ఘకాలిక పరిస్థితులు నెలకొన్నాయి.

Diabetes Management: Diet And Lifestyle Changes To Adopt Today

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మధుమేహం వ్యాధితో బాధపడటం సర్వ సాధారణంగా మారింది. బ్లడ్ లో షుగర్ (గ్లూకోజ్) లెవల్స్ దీర్ఘకాలిక పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే 12 ఏళ్లలో ప్రజల ప్రాణాలు బలిగొంటున్న వ్యాధుల్లో మధుమేహం ఏడో స్థానంలో నిలుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. మధుమేహం వ్యాధిని నియంత్రించేందుకు తరుచుగా శక్తిమంతమైన వైద్య చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆరోగ్య పద్దతులతోపాటు జీవన శైలిలో సమూల మార్పులు తీసుకొస్తేనే మధుమేహం నియంత్రణలోకి వస్తుందని చెబుతున్నారు. అయితే మార్పులు తీసుకు వచ్చే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా చాలా పరిశుభ్రమైన గాలిని పీల్చే వాతావరణం ఉండాలని వైద్య నిపుణుల సూచన. వాయు కాలుష్యానికి, లాన్సెట్‌కు మధుమేహానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మంచి ఎయిర్ ప్యూరిఫయ్యర్ వాడితే మంచిదని సలహా ఇస్తున్నారు. ఆల్కహాల్ సేవించకుండా ఉండటంతోపాటు పుష్కలంగా నీటిని తాగుతూ ఉండాలి. ఎయిరేటెడ్ నీటిని ఇవ్వాలి. ఇన్సులిన్, రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడానికి సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. ఆల్కహాలు తాగే అలవాటు ఉంటే పరిమితులు పాటించాలని బరువు తగ్గింపునకు దోహదపడుతుందని పౌష్టికాహార నిపుణులు సూచిస్తుంన్నారు. 

దుమపానాన్ని త్యజిస్తే గుండెపోటు, క్యాన్సర్, క్షయ, మధుమేహంతోపాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. సాధారణ వ్యక్తుల కంటే దుమపానం చేసేవారిలో మధుమేహం రెండు రెట్లు పెరుగుతుంది. వస్తువుల్లో కల్తీ, వాహనాలు వదిలిపెట్టే కర్బన వ్యర్థాలు, ట్రాఫిక్ సమస్యలు కూడా మధుమేహం సమస్య తలెత్తడానికి దారి తీస్తోంది. కార్డియో వాస్క్యులర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండె, ఛాతీ సంబంధ వ్యాధుల నుంచి బయటపడేందుకు వాయు కాలుష్యం తగ్గింపు పరిష్కార మార్గం అని అంటున్నారు. 

బచ్చలికూర తినడంతో మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. అందులోని ఐరన్ నిల్వలు రక్తంలో షుగర్ నిల్వలు తగ్గిస్తాయి. బచ్చలికూరలో ఫీచు పదార్థాలతోపాటు ఏ, బీ, సీ, ఈ, కే విటమిన్లు కలిగి ఉన్నాయి. 140 గ్రాముల టొమాటో ముక్కలు తింటే మరీ మంచిది. ఇందులో పుష్కలమైన ఖనిజ లవణాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా జామపండ్లు తినడంతో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. అవిసె గింజలు భారీగా భోజనంలో తీసుకుంటే గుండె సంబంధ ఆరోగ్య సమస్యలు తలెత్తనివ్వదని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. అలాగే రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించి వేస్తుందంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios