దోమల కారణంగా ప్రజలు అనేక మంది రోగాల బారిన పడుతున్నా రు. చిన్న దోమ కారణంగా డెంగీ వంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పో యే పరిస్థితులున్నాయి. దోమ ల నివారణకు మస్కిటో కాయిల్స్‌, ఎ లక్ర్టికల్‌ రీఫిల్స్‌, బ్యాట్స్‌ బాల్స్‌ ఇలా ఎన్నో పరికరాలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నాం. అయినా నివారణ సాధ్యం కావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. డెంగీ బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

అయితే.. ఈ డెంగీ, మలేరియా వ్యాపించే దోమల నివారణకు కొత్త పరిష్కారం కనిపెట్టారు శాస్త్రవేత్తలు.  ఇంతకీ మందు ఏంటో తెలుసా.. దోమలే. మీరు చదవింది నిజమే. ముల్లుకు ముల్లు.. వజ్రానికి వజ్రం ఎలాగో.. దోమకు దోమ అలా అనమాట. మలేరియా, డెంగ్యూలను నివారించేందుకు సరికొత్త దోమలను సృష్టించారు.

 ఆ దోమ పేరే వొల్బాన్చియా. ఈ దొమల్లో వొల్బాన్చియా అనే వైరస్ ఉంటుంది. దీంతో.. అవి మలేరియా, డెంగ్యూలను వ్యాప్తి చేసే దోమలను అంతమొందిస్తాయి. ఆస్ట్రేలియాలో ప్రయోగాత్మకంగా ఇది విజయవంతమైంది.  అక్కడ దోమలు ఎక్కువగా ఉండే నగరాలలో ఈ దోమలను ప్రవేశపెట్టారు. తద్వారా 2014 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక్కరు కూడా డెంగ్యూ, మలేరియా, జికా వంటి  రోగాలబారిన పడలేదు.