Asianet News TeluguAsianet News Telugu

sankranthi 2022 : సంక్రాంతికి ఇంటిని ఎలా ముస్తాబు చేయాలో తెలియడం లేదా.. అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి..

sankranti 22 :  సంక్రాంతి అంటేనే సంతోషాల లోగిలి. ఆనందాల కేళి..  ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు అంబురాన్నంటుతున్నాయి. ఈ పండుగ రాకతో ఇప్పటికే పట్టణాలన్నీ ఖాళీ అయ్యి పళ్లెలు నిండుకుండలా మారిపోయాయి. ముఖ్యంగా ఈ పండుగను చుట్టాలతో కలిసి జరుపుకుంటారు. అందుకే ఇళ్లన్నీ నీట్ గా ఎంతో అందంగా తయారు చేయారు చేయాలనుకుంటారు. 

Decorate your home like this with sankranthi festival
Author
Hyderabad, First Published Jan 13, 2022, 4:17 PM IST

sankranti 2022 : సంక్రాంతి వస్తూ.. వస్తూనే ఎన్నో సంతోషాలను, ముచ్చట్లను మోసుకొస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు, చుట్టాలను సొంతూళ్లకు పట్టుకొస్తుంది. అంతా ఒకే చోట పండుగ జరుపుకోవడంలో ఉన్న సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనిది. ఏ పండుగను కలిసి జరుపుకోకపోయినా ఈ సంక్రాంతి festival ను మాత్రం జరుపుకుంటారు. అందరూ ఒకే చోట చేరి కబుర్లతో కాలక్షపం చేస్తుంటారు. ఇన్ని రోజులు జరిగిన ఊసులను, ముచ్చట్లను చెప్పుకుంటూ ఆనందంగా గడిపే క్షణాలు మరువలేనివి. మరి అందరూ ఆనందంగా కలిసే మీ ఇంటికి ఫెస్టివల్ స్పెషల్ గా కొత్త లుక్ ను తెచ్చారా.. మీ ఇంటిని అందంగా ముస్తాబు చేసి అందరికీ Surprise ప్లాన్ చేశారా.. లేదా..? ఇంటిని ఈ పండుగకు ఎలా ముస్తాబు చేయాలో తెలియడం లేదా.. అయితే సింపుల్ గా ఉండే ఈ టిప్స్ ను పాటించి.. మీ ఇంటిని అందంగా తయారు చేసేయండి.

అందరూ కలిసి మాట్లాడుకునే చోటులో పెద్దగా ఉండే బల్లలను, Wooden benches ను వేయండి. వాటి మీద కలర్ ఫుల్ గా ఉండే దుపట్టాలు లేదా కుషన్స్ వేస్తే.. అందమైన లుక్ వస్తుంది. ఒక వేళ మీది చిన్న ఇల్లు అయితే హాల్ నిండా పరుపు, లేదా చాపలను పరచాలి. వాటిచుట్టూ నాలుగు వైపులా పూల మొక్కలను పెడితే అందంగా మారిపోతుంది. అలాగే వింటేజ్ లుక్ కోసం Wallకు లాంతర్లు పెడితే సూపర్ గా మారిపోతుంది.  ఇంటిని చూడగానే ఆకర్షించేవి గుమ్మాలు. వాటివి బంతి పూలు, చామంతి పూలతో మాలలు వేస్తే  ఎంతో అందంగా ఫెస్టివల్ లుక్ వస్తుంది. 

అయితే Routine గా కాకుండా తీరుతీరుగా ఉండేలా మాలను గుమ్మానికి అలంకరిస్తే ఇంకా బావుంటుంది. వీటితో పాటుగా మామిడి ఆకుల్ని పువ్వులా తయారుచేసి దాని మీద బంతిపువ్వులు చేర్చి గుమ్మానికి చెరో పక్క వేస్తే కూడా అందమైన లుక్ వస్తుంది. కొన్ని నీటి తొట్టెలు తీసుకుని వాటిలో చామంతి లేదా.. బంతి, గులాబీ పువ్వులను వేసి ఇంట్లో అక్కడక్కడా పెడితే మరెంతో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గుతో పాటుగా పూలతో ‘హ్యాపీ సంక్రాంతి’ అని రాసి చూడండి.. ఎంత అందంగా ఉంటుందో మీరే చూస్తారు. 

వెలుగుల తో సంక్రాంతికి మరింత శోభ వస్తుందన్న సంగతి మీకు ఎరుకేనా. అందుకే మీ ఇంటికి ఎలక్ట్రిక్ లైట్స్ ను పెట్టించండి. వీటి వెలుగులతో మీ ఇంటికి సరికొత్త కళ వస్తుంది.  ఇకపోతే పతంగులతో కూడా సంక్రాంతి స్పెషల్ డెకరేషన్  చేయొచ్చు. ఇంటి గుమ్మం చుట్టూ  Different colorsలో ఉండే పతంగులను అతికిస్తే మంచి లుక్ వస్తుంది. అలాగే వీటిని లివింగ్ రూమ్ లో  Different షేప్స్ లో పెట్టినా ఇంటికి సరికొత్త లుక్ వస్తుంది. కలర్ కాంబినేషన్ మంచిగా ఉండేలా చూసి గోడకు అతికించి చూడండి.. తర్వాత మీ ఇంట్లో వచ్చిన మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios