Asianet News TeluguAsianet News Telugu

ఈ లవ్ ట్రెన్ ఒంటరిగా ఎక్కితే... జంటగా బయటకు రావచ్చు

గతేడాది చైనాలో 1000 మందిలో కేవలం 7.2శాతం మందికి మాత్రమే వివాహం అయ్యిందని అధికారులు తెలిపారు. రాగల ముప్పై ఏళ్లలో దాదాపు 30 లక్షల మంది యువతీ యువకులు వారి జీవితంలో పెళ్లి అనే అంకం లేకుండానే జీవితాన్ని ముగించనున్నారని తేలింది. 

China Sends More Than 1,000 Single People On 'Love Train' To Find Their Other Half
Author
Hyderabad, First Published Aug 31, 2019, 3:30 PM IST

మీ జీవితంలో సరైన జోడీ కోసం వెతుకుతున్నారా..? ఎంత మందిని చూసినా మనసుకు నచ్చడం లేదా... అయితే ఇంకెందుకు ఈ లవ్ ట్రైన్ ఎక్కేయండి. మీకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోండి అంటోంది చైనా ప్రభుత్వం. చైనాలో ప్రత్యేకంగా సింగిల్స్ కోసం ఈ ట్రైన్ ఏర్పాటు చేశారు.

ప్రపంచం మొత్తంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో కంట్రోల్ చేయడానికి ఒకరు ముద్దు లేదా అసలే వద్దు అనే సిద్ధాంతాన్ని తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే... ఈ సిద్ధాంతం కారణంగా పెళ్లి కాకుండా మిగిలిపోతున్న యువత సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందట.

గతేడాది చైనాలో 1000 మందిలో కేవలం 7.2శాతం మందికి మాత్రమే వివాహం అయ్యిందని అధికారులు తెలిపారు. రాగల ముప్పై ఏళ్లలో దాదాపు 30 లక్షల మంది యువతీ యువకులు వారి జీవితంలో పెళ్లి అనే అంకం లేకుండానే జీవితాన్ని ముగించనున్నారని తేలింది. ఈ నేపథ్యంలో పెళ్లి కానీ యువతీ యువకుల కోసం ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది చైనా. ఒంటరి పక్షుల కోసం ‘లవ్‌ పర్స్యూట్‌’ పేరుతో మూడేళ్ల క్రితం ప్రత్యేక రైలును ప్రారంభించింది.

China Sends More Than 1,000 Single People On 'Love Train' To Find Their Other Half

ఈ రైలులో ఒక్కో ట్రిప్‌లో దాదాపు 1000 మంది పెళ్లి కానీ యువతీ యువకులను ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. చాంగ్‌కింగ్‌ నార్త్‌ స్టేషన్‌ నుంచి కియాంజియాంగ్‌ స్టేషన్‌ వరకు రెండు పగళ్లు, ఒక రాత్రి సాగే ఈ ప్రయాణంలో యువత తమకు జీవితభాగస్వామిగా సరిపోయే వ్యక్తులను అన్వేషించుకోవచ్చు. రైలులో ఉన్న వారిలో ఎవరైనా నచ్చితే వారితో స్నేహం చేసి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుని.. ఆ తర్వాత అన్ని బాగున్నాయనుకుంటే.. పెళ్లి చేసుకోవచ్చు. వీరందరికి రైలులోనే భోజన, వసతి సదుపాయాలు కల్పించడమే కాక వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

లవ్‌ పర్స్యూట్‌ రైలులో ప్రయాణిస్తున్నప్పుడే తాను తన జీవితభాగస్వామిని గుర్తించానని యాంగ్‌ హువాన్‌ తెలిపింది. తిరుగు ప్రయాణంలో తాము ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నామన్నది. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కటే అని తేలడంతో వివాహం చేసుకున్నామన్నది. ఈ ప్రయాణంలో తోడు దొరకకపోయినా.. మంచి మిత్రులు పరిచయం అవుతారంటుంది యాంగ్‌.

Follow Us:
Download App:
  • android
  • ios