Asianet News TeluguAsianet News Telugu

Covid 3rd Wave : బీ కేర్ ఫుల్.. పిల్లలకే ఒమిక్రాన్ ఎక్కువగా సోకే ప్రమాదముందట.. ఎందుకంటే?

Covid 3rd Wave : ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా రక్కసి. దీని బారిన పడి ఇంకెంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సివస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు జీవిస్తున్నారు జనాలు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ సునామిలా మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇక ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 
 

Children are more at risk of omicran than adults
Author
Hyderabad, First Published Jan 15, 2022, 4:34 PM IST

Covid 3rd Wave : ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా రక్కసి. దీని బారిన పడి ఇంకెంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సివస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు జీవిస్తున్నారు జనాలు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ సునామిలా మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇక ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

 ప్రపంచ దేశాలన్నీ కనిపించని కరోనా వైరస్ తో యుద్దం చేస్తున్నాయి. కంటికి కూడా కనిపించని ఈ వైరస్ ప్రజల గుండెల్లో ప్రాణ భయాన్ని కలిగించింది. ఏ క్షణాన దీని బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని పుట్టెడు భయంతో బిక్కు బిక్కు మంటు బతుకుతున్నారు. అందులోనూ ఈ మహమ్మారి సుడి గుండం లా మారి విలయతాండవం చేస్తోంది. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుని రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిందనుకున్న సమయంలోనే ఒమిక్రాన్ అంటూ ప్రజల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దీనికి తోడు థర్డ్ వేవ్ కూడా ప్రపంచ దేశాలలో రంగ ప్రవేశం చేసి తీవ్రమైన కలవరానికి గురిచేస్తోంది. 

ఇక ఒమిక్రాన్ దాడి మామూలుగా లేదు. ఇది ప్రపంచ దేశాలకు సవాల్ చేస్తోంది. దీని దాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కఠిన ఆంక్షలను అమలు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ వేరియంట్ అన్నింటికంటే చాలా తొందరగా వ్యాపిస్తుందని ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పారు. అందులోనూ పెద్దలకంటే చిన్నపిల్లలకే థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ఇది ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన సెమినార్ లో ఆసక్తికరమై విషయాలను వెళ్లడించారు ఎయిమ్స్ పీడియాట్రరి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేశ్ లోదా. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒకరి నుంచి వేరొకరికి  Very fast గా వ్యాపిస్తుందని వెళ్లడించారు.

 ముఖ్యంగా ఒమిక్రాన్ లక్షణాల తీవ్రత పెద్దలలో కంటే పిల్లలోనే  ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. కాగా ఈ ఒమిక్రాన్ ఇంత వేగంగా వ్యాపించడానికి కారణం.. ప్రజల్లో దీనిపై సరైన అవగాహన లేకపోవడమేనని అంటున్నారు. దీని పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో అంతే వేగంగా ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కొవిడ్ నిబంధనలు సక్రమంగా పాటిస్తేనే దీని బారి నుంచి బయటపడగలమని నిపుణులు తెలుపుతున్నారు. Social Distance, mask లు మంచిగా వాడకపోతే ఈ మహమ్మారి వ్యాప్తి మరింత పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని హచ్చరిస్తున్నారు. కాగా అమెరికాలో చాలా మంది పిల్లలు కరోనా బారిన పడి హాస్పటలల్లో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే కరోనా వచ్చిన పిల్లల్లో ఛాతి నొప్పి, గొంతు నొప్పి, జ్వరం, దగ్గు తో పాటుగా ముఖం వాపు వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయని నిపుణులు వెళ్లడించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios