కాఫీ ప్రియులకు నిజంగా ఇది శుభవార్తే. రోజు కాఫీ తాగేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా తాజా పరిశోధనలో వెల్లడైంది. జపాన్ లోని కనజావా యూనివర్సిటీకి  చెందిన పలువురు సైంటిస్ట్ లు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది.

ముందుగా ఎలకలపై వీరు ఈ ప్రయోగాన్ని చేశారు. దాదాపు 16 ఎలకలను ఎంచుకొని వాటిని ప్రతిరోజూ కాఫీ పొడినిఆహారంగా పెట్టారు. కొద్దికాలం తర్వాత వాటిపై పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో నిత్యం కాఫీ పొడి తీసుకున్న ఎలుకల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని తేలింది. 

 కాఫీలో ఉండే క‌హ‌వోల్ యాక్సిటేట్‌, కేఫ్‌స్టాల్ అనే స‌మ్మేళ‌నాలు ప్రోస్టేట్ క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయ‌ని, క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయ‌ని గుర్తించారు. అందువ‌ల్ల నిత్యం కాఫీ తాగ‌డం వల్ల క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

అయితే కాఫీ తాగితే క్యాన్స‌ర్ రాదు క‌దా.. అని చెప్పి అదే ప‌నిగా ఎక్కువ సార్లు కాఫీ తాగ‌డం కూడా మంచిది కాద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. నిత్యం 2, 3 క‌ప్పుల కాఫీ అయితే ఫ‌ర్వాలేదు కానీ.. అంత‌కు మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు