కివిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మంచి బాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది.
కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
రోజూ కివీ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సి, ఇ చర్మాన్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. ఆరోగ్యకరమైన, యవ్వనమైన చర్మాన్ని అందిస్తాయి.
కివీలో లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును కాపాడటంలో, వయసు సంబంధిత సమస్యల నుంచి కళ్లను రక్షించడంలో ముఖ్యమైనవి.
కివి తినడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సాయపడుతుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటంతో బరువు తగ్గడానికి కివీ ఉపయోగపడుతుంది.
పచ్చి బఠానీలు రోజూ తింటే ఏమౌతుంది?
ఇవి తింటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..!
రోజూ బాదం పప్పు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే
పరగడుపున జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?