1 కిలో మీటర్ నడిస్తే ఎంత బరువు తగ్గుతారో తెలుసా?

రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటిలో వెయిట్ లాస్ ఒకటి. అయితే మీరు ఒక కిలో మీటర్ నడిస్తే ఎంత బరువు తగ్గుతారో తెలుసా?

Calories Burned Walking 1 km How to Lose Weight by Walking rsl

బరువు తగ్గడం అంత సులువైన విషయం కాదు. కానీ ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. ఏవి పడితే అవి తినకూడదు. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అయితే చాలా మంది కఠినమైన వ్యాయామాలను చేయడానికి  ఇంట్రెస్ట్ చూపరు. ఇలాంటి వారికి వాకింగ్ బాగా సహాయపడుతుంది. అవును రోజూ వాకింగ్ చేయడం వల్ల మీరు బరువు తగ్గడమే కాకుండా మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

1 కిలో మీటర్ నడిస్తే ఎన్ని కేలరీలు కరుగుతాయి? 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 1 కిలో మీటర్ నడవడం వల్ల ఒక్కొక్కరూ ఒక్కో విధంగా బరువు తగ్గుతారు. అయితే మీరు నడిచే వేగం, మీ శరీర బరువు, నడిచే దూరంపై మీ వెయిట్ లాస్ ఆధారపడి ఉటుంది. ఖర్చయ్యే కేలరీల సంఖ్య మారుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

శరీర బరువు:

బరువు ఎక్కువగా వారు వాకింగ్ చేయడం వల్ల ఎక్కువ కేలరీలను కరిగించగలుగుతారు. ఎందుకంటే వీళ్లు నడుస్తున్నప్పుడు ఎక్కువ శక్తి వినియోగించబడుతుంది. కానీ వీళ్లకు వాకింగ్ అంత సులువైన విషయం కాదు. అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక 100 కిలోల బరువున్న వ్యక్తి నడవడానికి, 70 కిలోల బరువున్న వ్యక్తి వాకింగ్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. 70 కిలోల బరువున్న వ్యక్తి  1 కిలోమీటర్ వాకింగ్ చేసినప్పుడు 100 కిలోల బరువున్న వ్యక్తి కంటే తక్కువ కేలరీలను ఖర్చు చేస్తాడు.

వాకింగ్ వేగం:

వాకింగ్ చేయడం వల్ల మనం ఎన్ని కేలరీలను కరిగించామనేది మనం నడిచే వేగం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు గంటకు 3 నుంచి 4 కి.మీ కంటే గంటకు 5 కి.మీ. నుంచి 6 కి.మీటర్లు నడిస్తే ఎక్కువ కేలరీలను కరిగించగలుగుతారు. ఫాస్ట్ గా వాకింగ్ చేయడం వల్ల మీ  శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. దీంతో మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. 

వాకింగ్ చేసే ప్రదేశం:

మీ శరీరం ఎన్ని కేలరీలను కరిగించింది అనేది మీరు నడిచే ప్రదేశంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంటే సమతల ప్రదేశంలో వాకింగ్ చేయడం కంటే ఎత్తుగా ఉన్న మెట్లు, కొండలపైకి ఎక్కడం వల్ల మీరు ఎక్కువ బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇందుకోసం మీరు ఎక్కువ శక్తిని వినియోగిస్తారు. కేలరీలను ఎక్కువ కరిగించగలుగుతారు. 

తక్కువ వయస్సు vs ఎక్కువ వయస్సు

 వయసును బట్టి కూడా బరువు ఎంత తగ్గుతున్నారనేది ఆధారపడుతుంది. అంటే వయసును బట్టి మన జీవక్రియ మారుతుంది. మీకు తెలుసా? మన వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ తగ్గడం స్టార్ట్ అవుతుంది. వృద్ధులు వాకింగ్ చేసేటప్పుడు కరిగించిన కేలరీల కంటే యువకులే ఎక్కువ కేలరీలను కరిగించగలుగుతారు. అలాగే ఆడవారికంటే మగవారే తొందరగా బరువు తగ్గుతారు. 

కేలరీల గురించి..

  • 55 కిలోలున్న ఒక వ్యక్తి గంటకు 5 కి.మీ. వేగంతో 1 కి.మీటర్ నడిస్తే సుమారుగా 50 నుంచి 60 కేలరీలను కరిగించగలుగుతాడు. 
  • అలాగే 70 కిలోల బరువున్న వారు ఒక కిలోమీటర్ నడిస్తే సుమారుగా 60 నుంచి 75 కేలరీలను కరిగించగలుగుతాడు. 
  • అయితే 90 కిలోల బరువున్న వ్యక్తి వేగంగా ఒక కిలో మీటర్ నడిస్తే 80 నుంచి 100 కేలరీలను ఖర్చు చేయగలుగుతాడు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు నడిచే వేగం, మీ బరువు, నడిచే దూరాన్ని బట్టి సుమారుగా 5 గ్రాముల నుంచి 310 గ్రాముల వరకు బరువు తగ్గుదల ఉంటుంది. ఇవి కేవలం అంచనా మాత్రమే. అయితే ఇది వ్యక్తి వ్యక్తికి మారొచ్చు. 

ఎక్కువ కేలరీలను ఖర్చు చేయడానికి ఏం చేయాలి?  

మీరు కేలరీలను ఎక్కువగా కరిగించాలనుకుంటే మాత్రం వేగంగా వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీరు నడిస్తే మీ గుండె వేగంగా కొట్టుకోవాలి. దీనివల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. మీరు వాకింగ్ కు వెళ్లినా మధ్య మధ్యలో రన్నింగ్ చేయండి. ఇది మంచి వ్యాయామం. దీనివల్ల మీ  శరీరం ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది. అలాగే ఒకే రకమైన భూభాగంలో కాకుండా అప్పుడప్పుడు ఎత్తు పల్లాలు ఉన్న భూభాగంలోని కొండ మార్గాల్లో నడిస్తే మీరు ఎక్కువ బరువు తగ్గగలుగుతారు. అయితే ప్రతిరోజూ ఒకే దూరానికి వాకింగ్ చేయకుండా కొంచెం ఎక్కువ దూరం నడవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీరు ఎక్కువ బరువు తగ్గుతారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios