నిద్రలో గురక పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. గురకపెట్టేవారికి పెట్టిన విషయం తెలియకపోవచ్చు. కానీ..పక్కన వారికి మాత్రం అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు.. గురకపెట్టే వారికి ప్రశాంతమైన నిద్ర లభించదట. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కేవలం కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా..

1.అర టీ స్పూన్ తేనెలో మరో అర టీ స్పూన్ ఆలీవ్ ఆయిల్ కలిపి రాత్రి పూట నిద్రపోవడానికి ముందు  తాగితే.. మంచి ఫలితం ఉంటుంది.
2.ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి పడుకునే ముందు నోటిలో పోసుకొని బాగా పుక్కిలించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే.. గురక తగ్గుతుందట.
3. కొద్దిగా పిప్పర్ మెంట్ ఆయిల్ ని చేతి వేళ్లకు రాసుకొని రాత్రి పడుకునే ముందు వాసన చూసినా.. గురక తగ్గుతుంది.

4. రాత్రి పడుకోవడానికి ముందు మరిగే నీటిలో నాలుగు లేదా ఐదు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా తరచుగా చేస్తే.. గురక తగ్గుతుంది.
5. ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గుర‌క స‌మ‌స్య త‌గ్గుతుంది.