Tomato peel: టమాటానే కాదు టమాటా తొక్క కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. దీని తొక్కతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేంటంటే.. 

టమోటాలను దాదాపుగా అన్ని రకాల కూరగాయలు, వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది కూరలను టేస్టీగా చేస్తుంది. అందుకే టమాటా లేని కూర ఉండదు. ఈ టమాటాలను సలాడ్ల నుంచి చట్నీలు, కూరగాయల వరకు ప్రతిదానిలో ఉపయోగిస్తారు. కానీ కొన్ని రకాల కూరలకు టామటా తొక్కను తీసేస్తుంటారు. బయటపారేసే ఈ తొక్క మనకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ టొమాటో తొక్క (Tomato peel) వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి. 

టొమాటో తొక్కలో ఉండే పోషకాలు.. టొమాటో తొక్కలో అనేక విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా టమాటాలల్లో ఉండే ఫ్లేవనాల్స్ టమోటాలలో కంటే టమోటా తొక్కలోనే ఎక్కువగా ఉంటాయి. 

చర్మానికి.. పనాసియా టొమాటో తొక్కలు మీ చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది చర్మ రంధ్రాలు మరియు బ్లాక్ హెడ్స్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. దీనికోసం టొమాటో తొక్కలను ఎండబెట్టి, ఆ తర్వాత దాని పొడిని తయారు చేసి అందులో రోజ్ వాటర్ లేదా నార్మల్ నీటితో పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. దీనివల్ల ముఖం శుభ్రంగా తయారవుతుంది. 

జిడ్డు చర్మం (Oily skin) ఉండే వారికి ఇది చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఈ టొమాటో తొక్కలు ఆయిలీ స్కిన్ ను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. దీని కోసం టొమాటో తొక్కలను ముఖంపై బాగా రుద్ది 10-15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసుకుంటే మీ ముఖం ఆయిల్ ఫ్రీగా కనిపిస్తుంది.

టమోటా సూప్ ల నుంచి టొమాటో సాస్ లను తయారు చేయడానికి టమాటాలనే కాదు.. మీరు టొమాటో తొక్కలను కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం టొమాటో తొక్కలను ఎండబెట్టి, ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీరను వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ పేస్ట్ ను సూప్, సాస్ లేదా పిజ్జా సాస్ గా ఉపయోగించవచ్చు.

టమోటా పౌడర్ తయారు చేసే పద్దతి.. మార్కెట్ లో టమోటా పౌడర్ చాలా ఎక్కువ ధరకు లభిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు టమోటా తొక్కలతో ఇంట్లో కూడా టమాటా పౌడర్ ను తయారు చేసుకోవచ్చు. ఈ టొమాటో పొడి ఏదైనా మ్యారినేట్ చేయడానికి లేదా సలాడ్ కు జోడించొచ్చు. దీనికోసం టొమాటో తొక్కలను ఎండబెట్టి పొడిలా తయారుచేసే క్రమంలో మీ చేతులతో దానిని గుజ్జులా చేయాలి. గార్నిష్ నుంచి గ్రేవీని చిక్కగా చేయడానికి ఇప్పుడు మీరు ఈ టొమాటో పొడిని ఉపయోగించవచ్చు.

టమోటో తొక్కలను శుభ్రపరచడానికి ఉపయోగించండి.. తుప్పు పట్టడం నుంచి పాత్రలను శుభ్రం చేయడం వరకు మీరు ఈ టమాటా తొక్కలను ఉపయోగించవచ్చు. దీనికోసం టొమాటో తొక్కలను మురికిగా లేదా మరకలు పడిన ప్రదేశంలో రుద్ది కాసేపు అలాగే వదిలేయాలి. కావాలనుకుంటే దానికి కొద్దిగా ఫుడ్ సోడాను కూడా జోడించవచ్చు. ఇది తుప్పు గుర్తులు మరియు సింక్ మీద నల్లటి మచ్చల వరకు అన్నింటినీ తొలగిస్తుంది.