నేడు దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ మన దేశంలో ఈ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం వెనక ఒక బలమైన కారణం ఉంది. ఈ ఉత్సవాలను స్వతంత్రానికి పూర్వం ప్రజలందరినీ ఐక్యమత్యంగా ఉంచడానికి ఉపయోగించారు.
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మహారాష్ట్రలో దీనిని మొదట్లో అత్యంత వైభవంగా జరపుకోవడం ప్రారంభించారు. తదనంతర కాలంలో దక్షిణ భారతదేశం, గుజరాత్ పాటు మిగితా ప్రాంతాల్లోనూ ఉత్సాహంగా నిర్వహించం మొదలుపెట్టారు. అయితే మహారాష్ట్రలో ఈ పండగను జరపుకోవడం అత్యంత ఘనంగా చేపట్టడం ప్రారంభించిన ఘనత మాత్రం బాలగంగాధర్ తిలక్ కే దక్కుతుంది. అంత వరకు మామూలుగా ఈ పండగను నిర్వహించుకునే వారు. అయితే స్వతహాగా జాతీయవాది అయిన తిలక్ ప్రజల్లో ఐకమత్యం దీనిని ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకున్నారు.
శివుడు, పార్వతి దేవీ చిన్న కుమారుడు అయిన గణేశుడి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ వేడుకలు జరపుకుంటారు. శాతవాహనులు, రాష్ట్రకూట, చాళుక్య రాజవంశాలు పాలించిన కాలంలో అంటే క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీ.శ. 1190 వరకు గణేష్ చతుర్థి ఉత్సవాల ప్రారంభ సందర్భాలు ఉన్నాయని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. చత్రపతి శివాజీ మహారాజా కూడా హిందూ సంస్కృతి, జాతీయతను ప్రోత్సహించడానికి నిర్వహించేవారు. ఇది పీష్వాల పాలనలో కూడా కొనసాగింది, వీరికి గణేశుడు ఇంటి దైవం.
1857 సమయంలో భారత్ బ్రిటీషర్ల చేతిలో ఉంది. ఆ సంవత్సరంలోనే సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనిని భారత స్వాతంత్ర మొదటి సంగ్రామంగా అభివర్ణిస్తారు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు తీవ్రమైన ముప్పు తెచ్చిన తిరుగుబాటు. బాలగంగాధర్ తిలక్ ఈ గొప్ప తిరుగుబాటు నాయకులలో ఒకరు. అయితే ఈ సమయంలో భారతీయులను మరింత ఏకం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఆయన.. దీని కోసం వినాయక చవితి వేడుకలను ఒక మంచి అవకాశంగా ఎంచుకున్నారు. ప్రజలందరూ సమానంగా పూజించే ఒక సాధారణ విగ్రహం అందరిని ఒకే చోట కలుపుతుందని ఆయన భావించారు.
గణేశుడిని అందరూ తమ దేవుడిగా భావిస్తారని, అగ్రవర్ణాలు, అట్టడుగు కులాలు, నాయకులు, అనుచరులు ఒకే విధంగా పూజిస్తారని తిలక్ గమనించారు. అందుకే గణేష్ చతుర్థిని జాతీయ పండుగగా చేపడుతూ.. బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఆయన దీనిని ప్రచారం చేశారు.
1893లో తిలక్ గణేష్ ఉత్సవాన్ని సామాజిక, మతపరమైన కార్యక్రమంగా నిర్వహించారు. పదో రోజు పండుగ రోజున భారీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే సంప్రదాయం మొదలు పెట్టింది, మండపాలలో గణేష్ చిత్రాలతో కూడిన పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించిన ఘనత తిలక్ కే దక్కుతుంది. బ్రిటీష్ వారు బహిరంగ సామాజిక, రాజకీయ సమావేశాలను నిషేధించిన సమయంలో ఈ పండుగ అన్ని కులాలు, వర్గాల సాధారణ ప్రజలకు ఒక సమావేశ స్థలంగా పనిచేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వినాయకచవితి వేడకులను ఘనంగా నిర్వహిస్తున్నారు.
