Asianet News TeluguAsianet News Telugu

తండ్రి పోలికలతో పుడితే ఆరోగ్యంగా ఉంటారా?

ఇతరులతో పోలిస్తే.. అచ్చంగా తండ్రి  పోలికలతో పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.

Babies who look like their fathers tend to be healthier, study finds Matthew Diebel
Author
Hyderabad, First Published Aug 10, 2018, 2:51 PM IST

ఆడపిల్ల తండ్రి పోలికలతో పుడితే అదృష్టమని.. మగపిల్లాడు తల్లి పోలికలతో పుడితే అదృష్టవంతులు అవుతారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. వాటిలో ఎంత నిజం ఉందో తెలీదు కానీ.. తండ్రి పోలికలతో పుడితే.. ఆ బిడ్డలు ఆరోగ్యవంతులు అవుతారంటున్నారు పరిశోధకులు.

మీరు చదివింది నిజమే.. తండ్రి పోలికలతో పుట్టిన పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవ్వరట. ఇతరులతో పోలిస్తే.. అచ్చంగా తండ్రి  పోలికలతో పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికాలోని  ఓ యూనివర్శిటీ వారు చేసిన పరిశోధనలో బయటపడింది. బిడ్డ పోలికలకీ, ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకునేందుకు వీళ్లు ఓ పరిశోధన నిర్వహించారు  ఇందుకోసం బిడ్డ ఒక చోట తండ్రి మరో చోట ఉండే  715 కుటుంబాలని ఎంచుకున్నారు. పిల్లలు తండ్రి పోలికతో ఉంటే... వాళ్ల మీద తండ్రికి ఎక్కువ ప్రేమ కలుగుతుందని వీరి పరిశోధనలో తేలింది. 

అంతేకాకుండా ఎక్కువ రోజులు తమ పిల్లలతో గడిపేందుకు తండ్రులు ఇష్టపడతాడట. పిల్లలతో ఎక్కువ సమయం గడపడమే కాకుండా వారి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారనీ, అదే వారిని ఆరోగ్యంగా ఉంచుతుందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే పోలికలు ఒక్కటే పిల్లలను ఆరోగ్యంగా ఉంచవనీ, వారి విషయంలో తల్లిదండ్రులు తీసుకునే శ్రద్ధ వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుందని వారు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios