Before Marriage: పెళ్లి చేసుకోవడానికి ముందు వదూవరులద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఇష్టపడతుంటారు. అందులో భాగంగానే తమ అభిరుచులను, ఇష్టాలను, అయిష్టాలను తెలుపుకుంటూ ఉంటారు. కానీ పెళ్లికి ముందు వీటికంటే ముందుగా వధూవరులిద్దరూ కొన్ని టెస్టులను తప్పనిసరిగా చేయించుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు. అవేంటంటే..
Before Marriage:ఇండియాలో ఆరెంజ్ మ్యారేజెస్ యే ఎక్కువుగా జరుగుతుంటాయి. ఇక ఈ అరెంజ్ మ్యారేజెస్ లో ఎన్నో తంతులుంటాయి. అమ్మాయి వాళ్లకు అబ్బాయి కుంటుంబం, ఆస్తి, వారి మనస్థత్వాలు, అబ్బాయి గుణ గణాలు, జాబ్, వంటి ఎన్నో విషయాలు నచ్చాలి. ఇక అబ్బాయివాళ్లకు కూడా అమ్మయి అందం, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వంటి ఎన్నో విషయాలను నచ్చితేనే ఒకే చెబుతుంటారు. ముఖ్యంగా వధూవరులిద్దరి జాతకాలు ఖచ్చితంగా కలవాల్సిందేనని పట్టుబడుతుంటారు. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా వధూవరులిద్దరూ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో వీరి వివాహానికి ముందుగా వీరిద్దరికీ మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ సమస్యలను పెళ్లికి ముందే తెలుసుకుంటే అప్పుడే పరిష్కరించుకోవచ్చు. పెళ్లి తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. అంతే కాదు మీ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. అంతేకాదు ఈ టెస్టుల ద్వారా శరీరకంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.Genetic disease testing: వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే ప్రతి జంట పెళ్లికి ముందుగా ఈ జన్యు వ్యాధి టెస్ట్ ను ఖచ్చితంగా చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే వధూవరులిద్దరిలో ఏ ఒక్కరికైనా ఈ జన్యుపరమైన రోగాలు ఉన్నట్టైతే.. అవి వారి పిల్లలకు సంక్రమిస్తాయి. కాబట్టి ముందే ఈ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. మూత్రపిండాల వ్యాధి, మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాలు జన్యుపరమైనవే.
2. బ్లడ్ గ్రూప్ టెస్ట్: పెళ్లి చేసుకునే జంట బ్లడ్ గ్రూప్ అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల మహిళలు గర్భాధారణ టైం లో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతారు. అందుకే పెళ్లికి ముందే Blood group compatibility test చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
3. లైంగికంగా సంక్రమించిన రోగం టెస్ట్: పెళ్లికి ముందే కొంత మంది రిలేషన్ షిప్ లో ఉంటే ఉంటారు. ఒకవేళ ఉంటే వారు లైంఘిక సంబంధాలను కొనసాగించే అవకాశం ఉంది. దీనివల్ల వారికి హెచ్ ఐవీ ఎయిడ్స్, హెర్పెస్, గోనేరియా, సెఫిలిన్ వంటి ఎన్నో రోగాలు సోకే అవకాశం ఉంది. కాబట్టి పెళ్లికి ముందే ఈ టెస్టు చేయించుకోవడం చాలా మంచిది. లేదంటే పెళ్లి తర్వాత ఈ జబ్బులున్నట్టు బయటపడితే.. అవి మీ భాగస్వామికి కూడా సోకే అవకాశం ఉంది.
4. వంధ్యత్వ పరీక్ష: వివాహ బంధం పిల్లల పుట్టుకతోనే సంపూర్ణం అవుతుంది. కాబట్టి పెళ్లికి ముందే వ్యంధత్వ(Infertility test) టెస్ట్ చేయించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఇది పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి. ఈ టెస్ట్ చేయడం ద్వారా మహిళల అండాశయ ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ వల్ల భార్యా భర్తలు వారి శారీరక సంబంధాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా కొనసాగించవచ్చు.
