Health Tips: కీళ్ల నొప్పులు ఉన్నవాల్లు ఈ కూరను అస్సలు తినకూడదు. అది తింటే ఇంకా నొప్పులు ఎక్కువవుతాయని గోంగూర కూరని తినకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ గోంగూరను తింటే వచ్చే లాభాలు అన్నీ.. ఇన్నీ కాదు. దీన్ని తినడం వల్ల సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే.. 

Health Tips: కీళ్ల నొప్పులు ఉన్నవాల్లు ఈ కూరను అస్సలు తినకూడదు. అది తింటే ఇంకా నొప్పులు ఎక్కువవుతాయని గోంగూర కూరని తినకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ గోంగూరను తింటే వచ్చే లాభాలు అన్నీ.. ఇన్నీ కాదు. దీన్ని తినడం వల్ల సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే.. 

ఆకుకూరల్లో ఒకటైన గోంగూర ను చాలా మంది తేలిగ్గా తీసిపారేస్తుంటారు. ఈ కూరను తినడం వల్ల కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయని అపోహపడి దీన్ని తినడం పూర్తిగా మానేస్తుంటారు. దీన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పలు వస్తాయనుకోవడం కేవలం మన అపోహ మాత్రమే. ఎందుకంటే ఈ గోంగూరలో చాలా ఔషద గుణాలు దాగున్నాయి. దీన్ని తినడం వల్ల గుండెకు మంచిది. శరీరంలో పేరకు పోయిన కొవ్వులను కరిగించడంలో ఇది ముందుంటుంది. ఎన్నో ఉపయోగాలున్న ఈ ఆకు కూరను వారానికి ఒకసారైనా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఈ ఆకులను పప్పులో వేసుకుని తిన్నా.. లేదా పచ్చడిగా చేసుకుని తిన్నా సూపర్ బెనిఫిట్స్ లభిస్తాయని ఆయుర్వుద వైద్యులు వెళ్లడిస్తున్నారు. మరి ఈ గోంగూరను తింటే మనకు వచ్చే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. డయాబెటీస్ తో బాధపడేవారికి గోంగూర చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించే గుణాలుంటాయి. అందులోనూ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. అందుకే డయాబెటీస్ ను అదుపులో పెట్టుకోవడానికి గోంగూరు చక్కగా సహాయపడుతుంది. 2. ఐరన్, పొటాషియం, ఖనిజ లవణాలు గోంగురలో మెండుగా లభిస్తయి. వీటివల్ల Blood pressure నియంత్రణలో ఉంటుంది. 
3. ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, బి వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటి వల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదమే లేదు. ఒక వేళ మీరు కంటి సమస్యలతో బాధపడితే గనుక వీటిని తింటే ఆ సమస్యల నుంచి దూరం కావొచ్చని నిపుణులు వెళ్లడిస్తున్నారు. గోంగూరలో ఉండే విటమిన్ సి, బీకాంప్లెక్స్ తో దంతాల సమస్యను దూరం పెట్టొచ్చు. అలాగే ఎముకలను పటిష్టం చేసే క్యాల్షియం కూడా గోంగూరలో పుష్కలంగా లభిస్తుంది. 

4. ప్రమాదకరమైన గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి దూరం చేయడంలో గోంగూర దివ్య ఔషదం లాగా పనిచేస్తుంది. దీనిలో ఉండే మినరల్స్, ఫోలిక్ యాసిడ్ వంటివి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని బయటపడేయటంలో ముందుంటాయి. 5. దగ్గు, దమ్ము, ఆయాసంతో బాధపడేవారికి బెస్ట్ మెడిసిన్ లా ఉపయోగపడుతుంది గోంగూర కూర. ఈ సమస్యలతో బాధపడేవారు గోంగూరను ఎక్కువగా తీసుకుంటే వీటిని నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు. 6. ఇకపోతే రేచీకటితో బాధపడేవారికి సహజ ఔషదంలా గోంగూర కూర ఉపయోగపడుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు దీన్ని తరచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాగా గోంగూర పువ్వులను రసాన్ని తాగితే కూడా ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. 7. కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడక అలర్జీలు వస్తుంటాయి. కానీ గోంగూర వల్ల అలర్జీ వచ్చే సమస్యే లేదు. కాబట్టి దీన్ని నిరభ్యంతరంగా తొనొచ్చు.