Asianet News TeluguAsianet News Telugu

పోలియోలో వైరస్ అంటూ ప్రచారం.. వేయించాలా, వద్దా..?

పోలియో డ్రాప్స్ కలుషితమయ్యాయని దీంతో దానిలో వైరస్ కలిసిందని.. వాటిని పిల్లలకు వేస్తే.. కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందనేది దాని సారాంశం. 

All about the latest polio vaccine scare
Author
Hyderabad, First Published Oct 6, 2018, 3:31 PM IST


పోలియో పిల్లలకు సోకకుండా ఉండేందుకు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ.. పోలియో చుక్కలు వేయించడం ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న కార్యక్రమం. అయితే.. ఎప్పుడూ లేనిది ఈసారి ఈ పోలియో చుక్కలపై ఓ ప్రచారం జరిగింది. పోలియో డ్రాప్స్ కలుషితమయ్యాయని దీంతో దానిలో వైరస్ కలిసిందని.. వాటిని పిల్లలకు వేస్తే.. కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందనేది దాని సారాంశం. ఈ వార్త వాట్సాప్ లలో విస్తృతంగా ప్రచారం జరగడంతో.. ఈ ఆదివారం పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించాలా వద్దా అనే అనుమానం తల్లిదండ్రుల్లో మొదలైంది.

అయితే.. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మీ చిన్నారులకు నిరభ్యంతరంగా పోలియో చుక్కలు వేయించవచ్చని తెలిపింది. బయోమెడ్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్లను కేంద్రం వెనక్కి రప్పించింది. దీంతో ఎలాంటి అనుమానాల్లేకుండా పల్స్ పోలియో డ్రాప్స్ వేయించాలని ప్రభుత్వం చిన్నారుల తల్లిదండ్రులను కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. 

వాస్తవానికి మన దేశం ఏడేళ్ల కిందటే పోలియో ఫ్రీగా అవతరించింది. కానీ పొరుగు దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశాల నుంచి వ్యాధికారక వైరస్ మన దేశంలో అడుగుపెట్టే అవకాశం ఉండటంతో.. పోలియో చుక్కల్ని చిన్నారులకు వేయిస్తున్నారు. 

యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా.. భారత ప్రభుత్వం బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్‌తోపాటు ఇన్‌యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్‌ (ఐపీవీ)ను కూడా అందుబాటులో ఉంచుతోంది. అంటే పోలియో రాకుండా డబుల్ డోస్‌ను అందిస్తోంది. ఐపీవీ వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ల ముప్పు ఉండదు. నోట్లో వేసే చుక్కలు కలుషితమైనా.. వైరస్ సోకే ముప్పు 7.5 లక్షల కేసుల్లో ఒక్కటే ఉంటుంది

Follow Us:
Download App:
  • android
  • ios