సెప్టెంబర్5 ప్రత్యేకత ఏంటి? అని  స్కూల్ కి వెళ్లే పిల్లవాడిని ఎవరిని అడిగినా టక్కున సమాధానం చెబుతారు. ఈ రోజు టీచర్స్ డే అని. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనకు విద్యతోపాటు మంచి మార్గదర్శకులుగా మారిన, మనకు నచ్చిన ఉపాధ్యాయులను ఈ రోజు సన్మానించుకుంటాం.

అసలు టీచర్ అంటే ఎవరు? కేవలం మనకు పాఠాలు చెప్పేవారు అనుకుంటే పొరపాటు. ఉపాధ్యాయుడు అంటే ఒక మెంటార్. ఒక మార్గదర్శి. ఒక కౌన్సలర్. ఒక ప్రొటెక్టర్. విద్యార్థి దశ నుంచి ఎదుగుతున్న ప్రతి పిల్లవాడికి ఇవన్నీ ఒక ఉపాధ్యాయుడు మాత్రమే అందించగలడు. మరి అలాంటి ఉపాధ్యాయులకు ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా..? అయితే ఈకింది సూచనలు ఫాలో అవ్వండి. వాటిలో ఏది మీకు నచ్చితే దానినే ఫాలో అవ్వండి.

1. ఉత్తరం...ఈ టీచర్స్ డే సందర్భంగా మీకు నచ్చిన గురువుకి ఓ ఉత్తరం రాయండి. ఆ ఉత్తరంలో మీ ఉపాధ్యాయుడు మిమ్మల్ని ఎంతలా ప్రభావితం చేశారో కూడా తెలియజేయండి. తరగతి గదిలో మీకు ఆ ఉపాధ్యాయుడితో ఎదురైన సందర్భాన్ని కూడా గుర్తు చేయండి. వాళ్లకి ఈ గిఫ్ట్ కచ్చితంగా నచ్చుతుంది.

2.స్క్పాప్ బుక్... మీ ఉపాధ్యాయుడికి స్ప్కాప్ బుక్ ని ఉచితంగా ఇవ్వండి.  మీ క్లాస్ మెట్స్ అందరితో కలిసి ఆ బుక్ ని నింపండి. ఇది కచ్చితంగా వాళ్లకు నచ్చుతుంది. అంతమంది విద్యార్థులు గుర్తించుకొని మరీ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడాన్ని వారు ఎన్నటికీ మర్చిపోలేరు.

3.వీడియో.. ఉత్తరాలు రాయడం, ఫోన్ లో మాట్లాడం పాతగా అయిపోయాయి అనుకుంటే... ఓ వీడియో తయారు చేయండి. మీ ఉపాధ్యాయుడితో మీకున్న అనుబంధాన్ని ఆ వీడియోలో రికార్డు చేయండి. తరగతి గదిలో జరిగిన ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ని కూడా అందులో గుర్తు చేయండి. 

4.మొక్క.... ఇవన్నీ కాదు అనుకుంటే ఓ అందమైన పూల మొక్కను బహుమతిగా ఇావ్వండి. ఆ మొక్క పెరిగి పెద్దదై పూలు పూసిన ప్రతిసారీ.. మిమ్మల్ని వారికి గుర్తు చేస్తూ ఉంటుంది.

5.చాలా మంది ఉపాధ్యాయులు సొంతంగా పాఠశాలలను నడుపుతుంటారు. వారి సొంత డబ్బుతో విద్యార్థులకు పుస్తకాలు, బెంచీలు లాంటివి కొనుగోలు చేస్తుంటారు. మీ ఉపాధ్యాయుడు కూడా ఆ కోవకు చెందినవారైతే... ఈసారి ఆ సహాయం మీరు చేయండి. ఆ స్కూల్లో విద్యార్థులకు కావాల్సిన మీ నగదుతో కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వండి.