52 ఏళ్లలోనూ ఇంత ఫిట్‌నెస్ ఎలా.? రవీనా టాండన్ బ్యూటీ సీక్రెట్ ఏంటంటే..
ఎప్పటకీ యవ్వనంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. ఇది ప్రతీ ఒక్కరికీ ఉండే కోరికే. అయితే అది అందరికీ సాధ్యం కాదు. ఎప్పటికీ ఫిట్‌గా ఉండాలంటే అంత సులభమైన విషయం కాదు. ఏళ్లు గడుస్తోన్న కొందరు సినీ తారలు యంగ్‌గా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ ఒకరు. ఇంతకీ హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ నటీమణి రవీనా టాండన్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. 1991లో పత్తర్ కే ఫూల్ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో హిట్ మూవీస్‌లో నటించింది. కాగా 1992లో వచ్చిన రథసారథి, 1993లో బంగారు బుల్లొడు మూవీతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించింది. ప్రస్తుతం 52 ఏళ్ల వయసులోనూ అందం, ఫిట్‌నెస్ విషయంలో దీపికా, కరీనా వంటి కుర్ర హీరోయిన్లుకు పోటీనిస్తోంది.
ఇప్పటికే వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. 2024లో మూడు చిత్రాల ద్వారా ప్రేక్షులను పలకరించిన రవీనా.. 2025లో కూడా జాలీ ఎల్‌ఎల్‌బీ3 మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక వయసుతో పాటు రవీనా అందం కూడా పెరుగతోందా అన్నట్లు అనిపిస్తోది. ఇప్పటికే చెరగని అందం, ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రవీనా తన ఫిట్‌నెస్‌కు సంబంధించి పలు సందర్భాల్లో పంచుకున్న కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
రవీనా టండ్ హెల్తీగా ఫిట్‌గా ఉండేందుకు అనేక రకాల వ్యాయామాలు చేస్తుంది. ఇంట్లో యోగా, కార్డియో వ్యాయామాలు చేస్తానని గతంలో పలుసార్లు తెలిపారు. ఇక బరువు అదుపులో ఉండేందుకు, కండరాలు బలోపేతంగా ఉండేందుకు రవీనా నిత్యం తన దినచర్యంలో పైలేట్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వారంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు ఈ వ్యాయామం చేస్తారు రవీనా.
స్విమ్మింగ్ కూడా..
రవీనా టాండన రెగ్యులర్ వర్కవుట్సలో స్విమ్మింగ్ కూడా ఒకటి. వారంలో కొన్ని గంటలైనా రవీనా స్విమ్మింగ్ కోసం కేటాయిస్తారు. ఇక ఏది ఏమైనా రోజూ 1 గంట ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తారు. ఎంతటి బిజీ షెడ్యూల్‌ఉన్నా వాకింగ్‌ను మాత్రం రవీనా ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయనని పలుసార్లు తెలిపారు.
ఆహారం విషయంలో..
రవీనా వ్యాయామాలతో పాటు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారాన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా పప్పులు, కూరగాయలు, రోటీ, పెరుగు ఉండేలా చూసుకుంటారు. ఇక శరీరానికి మంచి కొవ్వు అందేందుకు స్వచ్ఛమైన నెయ్యి, వెన్నను తీసుకుంటారు. తన చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఇదే కారణమని రవీనా తెలిపారు.
ఇక రవీనా తన హెల్త్ సీక్రెట్ గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పసుపు, లవంగం, అల్లం, ఎండుమిర్చి, ఆకుకూరలతో పాటు కొద్దిగా నెయ్యి వేసి తయారు చేసే రెసిపీని వాడుతానని తెలిపారు. ఇది బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.