బాలీవుడ్ అందాలని దిశా పటానీకి యూత్ లో క్రేజ్ ఎక్కువ. తన నటనతో పాటు అందంతో యువతను కట్టిపడేస్తుంది. ఇంత అందంగా ఉండటానికి గల సీక్రెట్ ని దిశా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. తాను ఫాలో అయ్యే సీక్రెట్ మీరు కూడా ఫాలో అయితే..ఆమెలాగే అందంగా, ఫిట్ గా ఉండొచ్చు అంటోంది. మరి తన బ్యూటీ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..

‘‘ మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన అందం ఆధారపడి ఉంటుంది. ఆకలి అయినప్పుడు తినడానికి ఆరోగ్యంగా ఉండటానికి తినడాకి తేడా ఉంటుంది. నేను ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం తినడానికే మొగ్గుచూపుతాను. 90శాతం మనం తీసుకునే ఆహారం మీదే మన ఆహార్యం ఆధారపడి ఉంటుంది. నేను సరైన ఆహారం తీసుకోకపోతే ఎంత శిక్షణ తీసుకున్నా ఉపయోగం ఉండదు. నాకు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం. నా మనసుకి నచ్చిన ఆహారాన్ని నేను కేవలం వారంలో  ఒక్కరోజు మాత్రమే తింటాను’’ అని దిశా పటాని తెలిపారు.

తన శరీరాకృతిపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతానని ఈ సందర్భంగా దిశా తెలిపింది. సినిమా షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత తన రోజువారీ కసరత్తులు చేస్తానని  చెప్పారు. ఏ ఒక్కరోజూ వాటిని వదిలిపెట్టనని ఆమె అన్నారు. క్రమం తప్పకుండా వాటిని పాటిస్తేనే.. ఇలాంటి ఆహార్యం లభిస్తుందని ఆమె తెలిపారు. తాను రోజూ జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్, వర్కౌట్స్ చేస్తానని... ఎంత పని ఒత్తిడి ఉన్నా వీటిని మాత్రం స్కిప్ చేయనని ఆమె అన్నారు. అందుకే దిశా పటానీ... పర్ ఫెక్ట్ యూత్ ఐకాన్ అని నెటిజన్లు అంటూ ఉంటారు. బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న దిశా... తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.