Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే...ఇవిగో చిట్కాలు

నీరు నిల్వ ఉన్న గుంతల్లో వేప పిండి చల్లడం ద్వారా దోమల సంతతిని అరికట్టవచ్చు. నీరు నిల్వ ఉన్న గుంతల్లో, స్టోరేజ్ ట్యాంకుల్లో 100గ్రాముల తాజా వేపగింజల పిడిని చల్లితే దోమలు గుడ్లు పెట్టవు. కిరోసిన్ లో వేప నూనె పోసి ఇంట్లో దీపం వెలిగించినా... దోమలు వ్యాపించకుండా ఉంటాయి.

6 Natural Ways to Keep Mosquitoes Away From Your Body
Author
Hyderabad, First Published Aug 5, 2019, 4:57 PM IST

దోమ చూడటానికి చిన్నగానే ఉంటుంది. కానీ అది తెచ్చి పెట్టే తంటాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. ప్రాణాంతకమైన వ్యాధులను మోసుకువచ్చి మానవాళిని ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేసేది ఈ చిన్న దోమలే. కుట్టినప్పుడు కాసేపు నొప్పి, దురద మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ దాని తర్వాతే డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు చుట్టుముడతాయి. మరి ఇవి రాకుండా జాగ్రత్తపడాలంటే.. ముందు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి.

దోమల నివారణకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇందుకు వేపనూనె, పసుపు చాలా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటిలోని నీటితొట్టి, కుళాయిల దగ్గర, మురికి కాలువల దగ్గర 100లీటర్ల నీటిలో 25గ్రాముల పసుపు పొడి కలిపి చల్లితే దోమల బెడద ఉండదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా వేపనూనెను చల్లినా దోమల బెడద తగ్గుతుంది.

అంతేకాదు నీరు నిల్వ ఉన్న గుంతల్లో వేప పిండి చల్లడం ద్వారా దోమల సంతతిని అరికట్టవచ్చు. నీరు నిల్వ ఉన్న గుంతల్లో, స్టోరేజ్ ట్యాంకుల్లో 100గ్రాముల తాజా వేపగింజల పిడిని చల్లితే దోమలు గుడ్లు పెట్టవు. కిరోసిన్ లో వేప నూనె పోసి ఇంట్లో దీపం వెలిగించినా... దోమలు వ్యాపించకుండా ఉంటాయి.

చామంతి పూలను ఎండబెట్టి వాటికి కొంచెం పేడ కలిపి చిన్న చిన్న బిళ్లలుగా చేసి ఎండ పెట్టాలి. బాగా ఎండిన ఈ బిళ్లలను రాత్రి పూట వెలిగిస్తే ఆ వాసనకు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

నిమ్మకాయను సగానికి కోసం దానిలో లవంగం మొగ్గను గుచ్చి.. వాటిని పగటి పూట గదిలో ఉంచితే డెంగీని వ్యాప్తి చేసే దోమలు ఆ ప్రాంతంలోకి రావు. అంతేకాదు.. ఇంట్లోని మూల ప్రాంతాల్లో కర్పూరం వెలిగించినా కూడా దోమలు రాకుండా ఉంటాయి. 

ఇంట్లో వాటర్ బాటిల్స్, ఎయిర్ కూలర్స్ లలో కూడా నీటి నిల్వ ఉండకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరి బోండాలు లాంటివి వెంటనే కాల్చి వేయాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios