ఎంత ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఇవే...
ఎలాంటి గర్భనిరోదక మాత్రలు వాడకున్నా.. ఈ మధ్యకాలంలో చాలా మంది సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే... ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని ముందుగానే తెలియజేస్తూ... కొన్ని లక్షణాలు స్త్రీలలో కనిపిస్తాయట. వాటిని గుర్తించగలిగితే.. వెంటనే వాటిని పరిష్కరించుకోవచ్చుంటున్నారు నిపుణులు.
ఎలాంటి గర్భనిరోదక మాత్రలు వాడకున్నా.. ఈ మధ్యకాలంలో చాలా మంది సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే... ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని ముందుగానే తెలియజేస్తూ... కొన్ని లక్షణాలు స్త్రీలలో కనిపిస్తాయట. వాటిని గుర్తించగలిగితే.. వెంటనే వాటిని పరిష్కరించుకోవచ్చుంటున్నారు నిపుణులు.
ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల లక్షణాలు ఏంటి..? దానికి ఎలాంటి చికిత్స అవసరమో ఇప్పుడు చూద్దాం..
అధిక బరువు: లావుగా ఉన్నప్పుడు కొవ్వు పొట్టలో ఎక్కువగా చేరుతుంది. ఈ కొవ్వు కారణంగా ఫిమేల్ హార్మోన్లు, మేల్ హార్మోన్లుగా మార్పు చెందుతాయి. దాంతో టెస్టోస్టెరాన్ పరిమాణం పెరిగిపోవడంతో అండాశయాల నుంచి అండాలు విడుదల కావు. దాంతో గర్భధారణ జరగదు. కాబట్టి.. సమతుల్య ఆహారం తీసుకుంటూ.. వ్యాయామం చేస్తే.. సులభంగా బరువు తగ్గవచ్చు.
పాలీసిస్టిక్ ఓవరీస్: ఈ సమస్య ఉన్నవాళ్లకు మొటిమలతో పాటు, ముఖం, గడ్డం మీద అవాంఛిత రోమాలు తలెత్తుతాయి. అలాగే నెలసరి కూడా ప్రతి నెలా ఆలస్యమవుతూ ఉంటుంది.
ఫైబ్రాయిడ్లు: ఈ సమస్య ఉన్న వారిలో నెలసరి స్రావం తీవ్రంగా ఉంటుంది. స్రావం గడ్డలు గడ్డలుగా ఉండవచ్చు. ఈ లక్షణాలు ఫైబ్రాయిడ్ సమస్యను సూచిస్తాయి. అయితే ప్రతి ఫైబ్రాయిడ్ వల్ల సమస్య ఉండకపోయినా, ఎన్ని ఉన్నాయి? ఎంత పెద్దగా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే అంశాల మీద గర్భం ధరించే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అవి గర్భసంచీలో ఉన్నా, పెద్దగా ఉన్నా, ఎక్కువ మొత్తంలో ఉన్నా గర్భధారణ జరగదు. వీటికి చికిత్స ఉంటుంది.
ఎండోమెట్రియాసిస్: నెలసరి సమయంలో నొప్పి ఉంటుంది. నెలసరి స్రావం కూడా తీవ్రంగా ఉంటుంది. అలాగే శారీరక కలయిక సమయంలో కూడా నొప్పి ఉంటుంది. గర్భసంచీ లోపల పెరగవలసిన పొర ఎండోమెట్రియం గర్భసంచీ బయట పెరగడమే ఈ సమస్యకు కారణం.
ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయనే అనుమానం మీకు కలిగితే... వెంటనే డాక్టర్లను సంప్రదించడండి. తద్వారా తగిన ట్రీట్మెంట్ వైద్యులు అందజేస్తారు. దాంతో... మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా సంవత్సరం తిరిగేలోగా మీ ఓడిలోకి చంటిపాపాయి వచ్చి చేరుతుంది.