Asianet News TeluguAsianet News Telugu

భారత్ లోనే కాదు, ఈ దేశాల్లోనూ దీపావళి సెలబ్రేషన్స్ అదిరిపోతాయ్..!

విదేశాల్లో ఉన్న మన భారతీయులు అక్కడ జరుపుకుంటారని భావిస్తుంటారు. కానీ, ఇతర దేశాల్లోనూ ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుతారు. ఆ దేశాలు ఏంటో ఓసారి చూద్దాం...

5 other countries that also celebrate the festival of lights ram
Author
First Published Nov 4, 2023, 12:15 PM IST

దీపావళి పండగను ఇష్టపడనివారు ఉండరు. ఆ పండగ రోజున ప్రతి ఒక్కరి ఇల్లు, వీధులు అన్నీ ప్రమిదల వెలుగులు, విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంటాయి. అయితే, ఇది మన పండగ కాబట్టి, మన దేశంలో మాత్రమే జరుపుకుంటారు అని అందరూ నమ్ముతుంటారు. లేదంటే, విదేశాల్లో ఉన్న మన భారతీయులు అక్కడ జరుపుకుంటారని భావిస్తుంటారు. కానీ, ఇతర దేశాల్లోనూ ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుతారు. ఆ దేశాలు ఏంటో ఓసారి చూద్దాం...

5 other countries that also celebrate the festival of lights ram


1.సింగపూర్

సింగపూర్‌లో దీపావళి ఒక ప్రధాన సాంస్కృతిక పండుగ. దేశంలోని లిటిల్ ఇండియా పరిసరాలను లైట్లతో అలంకరిస్తారు. సింగపూర్ టూరిజం ప్రకారం, దీపావళి సమయంలో ఏనుగులు, నెమళ్ల భారీ విగ్రహాలు లిటిల్ ఇండియా అంతటా ఏర్పాటుు చేస్తారు. అనేక దీపావళి బజార్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ పండుగలను ప్రారంభించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

2.ఫిజీ

గణనీయమైన హిందువుల జనాభా ఉన్న ఫిజీలో దీపావళిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది దేశంలో ప్రధాన పండుగ. ప్రభుత్వ సెలవుదినం కూడా ప్రకటిస్తారు. వెలుగుల పండగ రోజున ఇళ్లల్లో వెలుగులు నింపి ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజలు కూడా దేవాలయాలను సందర్శిస్తారు, వారి ఇళ్లను అలంకరించుకుంటారు. దీపావళి రోజున బాణాసంచా కాల్చి జరుపుకుంటారు.

5 other countries that also celebrate the festival of lights ram

మలేషియా

దీపావళి  మలేషియాలో కూడా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా, ఇళ్లను కాగితపు లాంతర్లు, మట్టి దీపాలు, కోలాలు లేదా రంగోలిలతో అలంకరిస్తారు. దేశంలో బాణసంచా నిషేధం ఉన్నందున మలేషియాలో దీపావళిని హరి దీపావళి అని కూడా పిలుస్తారు.

4.గయానా

దక్షిణ అమెరికా దేశమైన గయానాలో, దీపావళి వేడుకలు ఘనంగా జరుపుతారు. అందంగా ప్రకాశించే వాహనాలతో వార్షిక మోటర్‌కేడ్‌లు ఏర్పాటు చేస్సతారు. ఈ గ్రాండ్ ఊరేగింపులు ఒక ప్రధాన సాంస్కృతిక కార్యక్రమం, కేవలం హిందువులు మాత్రమే కాకుండా వివిధ వర్గాల నుండి వేలాది మంది గయానీలు హాజరవుతారు.

5 other countries that also celebrate the festival of lights ram

5.శ్రీలంక

దీపావళి పండగకు  శ్రీలంకలో ప్రభుత్వ సెలవుదినం ప్రకటిస్తారు. భారతదేశంలో మాదిరిగానే ఐదు రోజుల పాటు చాలా వైభవంగా, ప్రదర్శనతో జరుపుకుంటారు. దీపాలు వెలిగించడం, ప్రార్థనలు చేయడం, బాణసంచా పేల్చడం ద్వారా పండుగ జరుపుకుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios