Asianet News TeluguAsianet News Telugu

కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా తగ్గించే 10 బెస్ట్ ఫుడ్స్..!

ఊరికే అలసిపోవడం, అధిక రక్తపోటు, ఛాతిలో నొప్పి, మైకము వంటివి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు. అయితే కొన్ని రకాల ఆహారాలు, వ్యాయామంతో కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా తగ్గించుకోవచ్చు.
 

10 foods that lower cholesterol
Author
First Published Sep 6, 2022, 5:04 PM IST

మారుతున్న జీవన శైలి, శరీరక శ్రమ లేకపోవడం వల్ల నేడు ఎంతో మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ ప్రాణాలను కూడా తీస్తుంది. ఎలా అంటే శరీరంలో  చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోతుంది. ఇది గుండెకు వెళ్లే రక్తప్రవాహానికి అడ్డుగా నిలుస్తుంది. దీంతో  గుండె ప్రమాదంలో పడుతుంది. 

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు మైకము, ఛాతి నొప్పి, అలసట, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటుగా.. కొన్ని రకాల ఆహారాలను తింటే చెడు కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా తగ్గుతుంది. మరి ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం.. 

ఆపిల్

కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్స్ లో ఆపిల్ పండ్లు మొదటి జాబితాలో ఉంటాయి. ఎందుకంటే ఆపిల్స్ మనకు చేసే మేలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

బీన్స్

బీన్స్ హెల్తీ ఫుడ్. వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా తగ్గిపోతుంది.  బీన్స్ లో మెగ్నీషియం, జింక్, విటమిన్స్, ఖనిజాలు, కాపర్, మాంగనీస్ ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. 

బచ్చలి కూర

బచ్చలి కూరలో ఎన్నో పోషకాలుంటాయి. బచ్చలి కూర శరీర కొవ్వును తగ్గించే టాప్ ఫుడ్స్ లో ఒకటి. దీనిలో మెగ్నీషియం, విటమిన్ ఇ, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి. అందుకే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు ఈ ఆకుకూరను తప్పక తినండి. 

ఓట్స్

ఓట్స్ ఎన్నో జబ్బులను తగ్గించడానికి సహాయపడుతాయి. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తినడం వల్ల 12 నుంచి 24 శాతం వరకు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓట్స్ బరువును కూడా తగ్గిస్తాయి. అందుకే వీటిని రోజూ తినండి.

చేపలు

చేపలు కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. సార్డినెస్, సాల్మన్, మాకేరెల్ వంటి చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాదు.. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 

బెండకాయ

బెండకాయలో కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలుంటాయి. బెండకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  అంతేకాదు బరువును నియంత్రించే ఫైబర్ కంటెంట్ కూడా కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు రెగ్యులర్ గా బెండకాయను తినండి. 

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ తాగితే కూడా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. నారింజ రసంలో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలుంటాయి. అంతేకాదు వీటిలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచే గుణాలు కూడా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

గింజలు

గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బాదం పప్పులు, వాల్ నట్స్, శనగలు వంటి ఇతర ఆరోగ్యకరమైన గింజలను తినండి. ఇవి కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ప్రతిరోజూ గుప్పెడు గింజలు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాలు తగ్గుతాయి. 

టమాటాలు

 టమాటాలు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించే జాబితాలో ఉ న్నాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి. విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఈ టమాటాలు కళ్లు, చర్మం, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టమోటాల్లో ఉండే పొటాషియం కొలెస్ట్రాల్ ను, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. 

బొప్పాయి

బొప్పాయిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి.  వీటిలో బరువును తగ్గించే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటుగా అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios