Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండి...

విశాఖపట్నం(వైజాగ్) స్టీల్‌ ప్లాంటులో టెక్నికల్ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో  అందుబాటులో ఉంచింది. 

vizag steel plant released notification for the recruitment of management trainees posts
Author
Hyderabad, First Published Jan 29, 2020, 10:15 AM IST

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని విశాఖపట్నం(వైజాగ్) స్టీల్‌ ప్లాంటులో టెక్నికల్ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో  అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. సరైన విద్యార్హతలు కలిగిన వారు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా అభ్యర్థుల ఎంపికలు ఉంటాయి. 24 జనవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నాయి..


​వైజాగ్ స్టీల్ ప్లాంటులో పోస్టుల వివరాలు

మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్): 188 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-72, ఓబీసీ-69, ఎస్సీ-24, ఈడబ్ల్యూఎస్-23.

విభాగాల వారీగా ఉన్న ఖాళీలు : సిరామిక్స్ 04, కెమికల్ 26, సివిల్ 05, ఎలక్ట్రికల్ 45, ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ 10, మెకానికల్ 77, మెటలర్జి 19, మైనింగ్ 02.

also read UPSC jobs:యూ‌పి‌ఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ...

అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు పొందితే చాలు సరిపోతుంది.


​వయోపరిమితి: అభ్యర్ధులు 01.01.2020 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. 01.01.1993 తర్వాత జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు కల్పించారు. ఇతర వయో నిబంధనలు కూడా వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం: సరైన విద్యార్హతలు కలిగిన వారు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ప్రాసెసింగ్ ఫీజు: అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.590 చెల్లించాలి. ఎస్సీ, దివ్యాంగులు రూ.295 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.

​ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

​పరీక్ష విధానం:  ఆన్‌లైన్ రాత పరీక్షలో జనవరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ/ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.


ప్రతి విభాగం నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.


 పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు.

అర్హత మార్కులు: ఆన్‌లైన్ రాత పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రతి విభాగంలోనూ 50 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

also read విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలు...అప్లై చేసుకొండి వెంటనే...

పరీక్ష కేంద్రాలు: ఆన్‌లైన్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వీటితో పాటు ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పాట్నా, భువనేశ్వర్, చెన్నై, రాంచీ నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.


ఇంటర్వ్యూ: ఆన్‌లైన్ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.


ట్రైనింగ్, ప్రొబేషన్: మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఏడాది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.

​​పేస్కేలు/వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో బేసిక్ పే స్కేలు కింద నెలకు రూ.20,600 ఇస్తారు. ప్రీ రివైజ్డ్ పే స్కేలు రూ.20,600-3%-46,500 గా ఉంటుంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రీ రివైజ్డ్ పే స్కేలు కింద రూ.24,900-3%-50,500గా వేతనం ఇస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి.


​ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 24.01.2020 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 13.02.2020 ఫీజు చెల్లించడానికి చివరి తేది 14.02.2020

Follow Us:
Download App:
  • android
  • ios