Asianet News TeluguAsianet News Telugu

UPSC jobs:యూ‌పి‌ఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ...

యూపీఎస్సీ  వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న మెడిక‌ల్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ ఇంజినీర్, సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్ త‌దిత‌ర ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

union public service commission released notification 2020 for the recruitment of various posts
Author
Hyderabad, First Published Jan 28, 2020, 9:58 AM IST

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న మెడిక‌ల్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ ఇంజినీర్, సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్ త‌దిత‌ర ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ 27.01.2020 నుండి ప్రారంభమైంది. పోస్టుల వారీగా తగిన విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలీ. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు 134. 


ఏఈ, ఇతర ఉద్యోగాల పోస్టుల వివరాలు

 మెడికల్ ఆఫీసర్/రిసెర్చ్ ఆఫీసర్: 44

విభాగాల వారీగా ఖాళీలు: ఆయుర్వేద-37, యునానీ-07.

also read విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలు...అప్లై చేసుకొండి వెంటనే...

 అసిస్టెంట్ ఇంజినీర్ (క్యూఏ/సివిల్): 66

విభాగాల వారీగా ఖాళీలు: ఆర్మమెంట్ (అమ్యూనిషన్)-11, ఎలక్ట్రానిక్స్-39, ఆర్మమెంట్(వెపన్స్)-14, సివిల్-02.

 సైంటిస్ట్-బి: 08

విభాగాల వారీగా ఖాళీలు: డాక్యుమెంట్స్-06, కెమిస్ట్రీ-02.

 సీనియర్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్: 10

విభాగాల వారీగా ఖాళీలు: న్యూరో సర్జరీ-04, ప్లాస్టిక్ సర్జరీ-02, యూరాలజీ-04.

 స్పెషలిస్ట్ (గ్రేడ్-3): 04

విభాగాల వారీగా ఖాళీలు: గ్యాస్ట్రో ఎంటరాలజీ-01, ప్లాస్టిక్ సర్జరీ & రీకన్‌స్ట్రక్లివ్ సర్జరీ-03.

 ఆంథ్రోపాలజిస్ట్ (కల్చరల్ ఆంథ్రోపాలజీ డివిజన్): 01

 అసిస్టెంట్ లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ (తమిళం): 01

అర్హత‌: పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ/ ఎంబీబీఎస్‌ లో ఉత్తీర్ణులై ఉండాలి.

also read ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...అప్లై చేసుకోండీ.

వయోపరిమితి: పోస్టులవారీగా వయోపరిమితిని నిర్ణయించారు. కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 35 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకు 40-45 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు: పోస్టుల వారీగా సరైన విద్యార్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

ఎంపిక విధానం:  యూపీఎస్సీ నిబంధనల ప్రకారం పోస్టుల నియామక ప్రక్రియ ఉంటుంది.

 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 27.01.2020 చివరితేది: 13.02.2020 (23.59) దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 14.02.2020 (23.59)

Follow Us:
Download App:
  • android
  • ios