Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం వెంటనే అప్లయి చేసుకోండీ..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)  నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
 

upsc nda na 2 exam 2021 released registration starts on upsc gov in till june 29
Author
Hyderabad, First Published Jun 17, 2021, 4:57 PM IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సి) నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) నేవల్‌ అకాడమీల్లో ప్రవేశానికి (ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్‌ 2021) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ పోస్టులకు ఇంటర్మీడియెట్‌ / 10+2 ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ  ఇప్పటికే మొదలైంది. 29 జూన్‌ దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.upsc.gov.in/ చూడవచ్చు.


మొత్తం ఖాళీలు: 400
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ)- 370 (ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్‌ఫోర్స్‌ 120)
నేవల్‌ అకాడెమీ (ఎన్‌ఏ)- 3 (10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)

అర్హత: ఆర్మీ విభాగం పోస్టులకు ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియెట్‌ ఫైనల్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి  అర్హులు.

వ‌యసు: 2 జనవరి  2003 నుంచి 1 జనవరి 2006  తేదీ మధ్య జన్మించి ఉండాలి.

also read నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉబెర్‌లో భారీగా ఇంజినీర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.. ...

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 9 జూన్‌ 2021

దరఖాస్తులకు చివరి తేది: 29 జూన్‌ 2021

దరఖాస్తు ఫీజు: రూ.100

పరీక్ష తేది: 05 సెప్టెంబర్‌ 2021

పూర్తి వివ‌రాల‌కు అధికారిక వెబ్‌సైట్‌:https://www.upsc.gov.in/

Follow Us:
Download App:
  • android
  • ios